వికారాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుందని, బీసీల అభ్యున్నతి కోసమే తమ పార్టీ పని చేస్తుందని పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 2 కోట్లుగా చూపించారని, రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన సర్వేలో మాత్ర కోటి 80 లక్షలుగా వెల్లడైనట్లు తెలిపారు. పదేళ్లలో బీసీల్లో 20 లక్షల మంది చనిపోయారా అని ఎద్దేవా చేశారు. బీసీ జనాభా లెక్కలను గోల్మాల్ చేస్తున్నారని ఆరోపించారు.
