మిస్ యూ ఖాన్ సాబ్

మిస్ యూ ఖాన్ సాబ్

ఇర్ఫాన్ ఖాన్.. ‘ఇతనుమావాడు’ అని భారతీయ సినిమా గర్వంగా చెప్పుకుంటుంది ఆయనగురించి. నటనకు భాష్యం తెలుసుకుంటుంది యువతరం ఆయనను చూసి. అంత గొప్ప నటుడు ఇక లేడు. ఎప్పటికీరాడు. ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్.. బుధవారం కన్నుమూశారు. ఆ విలక్షణ నటుడికి ఇది ‘వెలుగు’ నివాళి.

లాక్‌‌డౌన్‌‌కి కొద్దిరోజుల ముందు బాలీవుడ్‌‌లో ‘అంగ్రేజీమీడియమ్’ సినిమారిలీజయ్యింది. అంతకుకొన్ని రోజుల ముందుఓ వీడియో విడుదలయ్యింది. అందులో ఒకవాయిస్ వినిపించింది. దాన్ని వింటూనే కోట్లాదిమంది కళ్లు చెమ్మగిల్లాయి. ఆ గొంతు పలికినమాటలు విని అందరి హృదయాలూ బరువెక్కాయి. ఆ వాయిస్ ఇర్ఫాన్ ఖాన్‌‌ది. ‘ఈ సినిమాని మేమంతా ఎంతో ప్రేమతోతీశాం. అంతేప్రేమగామీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సమయంలో మీఅందరితోనూ ఉండాలనినాకూ ఉంది. కానీ నాశరీరంలో ఒక అన్‌‌వాంటెడ్ గెస్ట్ తిష్ట వేసుకునికూర్చున్నాడు. తనతోయుద్ధం జరుగుతోంది.చూద్దాం చివరికి ఎవరుగెలుస్తా రో’ అని ఇర్ఫాన్‌‌ అంటుంటే..నువ్వే గెలుస్తావ్,నువ్వే గెలవాలి అంటూ ప్రతి మనసూ ప్రార్థించింది. ‘వెయిట్ ఫర్ మి’ అంటూ ఆ వీడియోనుముగించడం చూస్తే.. నేనుతప్పకుండా క్షేమంగావస్తా నుఅని ఇర్ఫాన్ మాట ఇచ్చినట్టు అనిపించింది. కానీ అలాజరగలేదు. ఇర్ఫాన్ కోలుకోలేదు. క్షేమంగా అందరి ముందుకీరాలేదు. అందనంతదూరం వెళ్లిపోయారు. అందరినీదు:ఖంలో ముంచేశారు.

క్రికెటర్‌ కాబోయి.. బాలీవుడ్‌‌లో ఎందరో ఖాన్స్ ఉన్నారు. వారందరిలో ఇర్ఫాన్ ఖాన్ ప్రత్యేకం. ఆయనకి చెప్పు కోదగ్గ బ్యాగ్రౌండ్ లేదు. ఎక్కడో జైపూర్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు . తల్లి తనను టీచర్‌‌‌‌ని చేయాలనుకుంది. కానీ ఆయన మాత్రం క్రికెటర్ అవ్వాలనుకున్నారు. ‘సీకే నాయుడు టోర్నమెంట్‌‌’కి సెలెక్టయినా.. ఆర్ధిక  సమస్యల వల్ల అటెండ్ కాలేకపోయారు. క్రికెట్‌‌కి దూరమయ్యారు. అంతలో మనసు నటనవైపు మళ్లింది. దాంతో ఎంఏ చదువుతూ తన స్కాల ర్‌షిప్ డబ్బులతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత టీవీలో అవకాశాలు వచ్చాయి. చాణక్య, బనేగీ అప్‌నీ బాత్, చంద్రకాంత, డర్, జై హనుమాన్ వంటి పలు సీరియల్స్‌ తో తన టాలెంట్‌‌ను అందరికీ పరిచయం చేశారు.

తనను ప్రపంచా నికి పరిచయం చేసిందనో ఏమో.. సినిమాల్లో చాన్సులు వచ్చినా టెలివిజన్ ఫీల్డ్‌‌ను వదిలిపెట్ట లేదు ఇర్ఫాన్. ఇటు సినిమాల్లోతన ముద్ర వేస్తూనే అటు టీవీ షోలలోనూ కనిపిస్తూ వచ్చారు. ఊహించని మలుపు అంతా చక్కగా సాగిపోతోంది. ఇర్ఫాన్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రేక్షకులు ఆయన పర్‌‌‌‌ఫార్మెన్స్‌చూసి ముగ్ధులవుతూ ఉన్నారు. 2018, ఫిబ్రవరి నెలవరకు ఇలాగే గడిచింది. కానీ ఆ నెలలో బయటికి వచ్చిన ఓ వార్త అందరినీ షాక్‌‌లో ముంచేసింది. ఇర్ఫాన్ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి అందరూ విస్తుపోయారు. అయితే ఆయన బాధపడుతోంది ఆ వ్యాధితో కాదని, అత్యంత అరుదైన న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తోనని తర్వాత తెలిసింది. ట్రీట్‌‌మెంట్ కోసం లండన్ వెళ్లిపోయారు ఇర్ఫాన్. ఎన్నో నెలల ట్రీట్మెంట్ తర్వాత వచ్చి ‘హిందీ మీడి యమ్‌ ’ సీక్వెల్ ‘అంగ్రేజీ మీడియ మ్‌’లో నటించారు. కానీ ఆ సినిమా పూర్తయ్యే సరికే అనారోగ్యం తిరగబెట్ట డంతో మళ్లీట్రీట్‌‌మెంట్ కోసం వెళ్లిపోయారు. ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడం చాలా బాధగా ఉందంటూ ఓ మెసేజ్ ను  మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పటికో ముంబై తిరిగొచ్చారు కానీ ఆరోగ్యం కుదుటపడలేదు. దానికి తోడు ఈ నెల 25న ఆయన తల్లిసైదా బేగం కన్నుమూశారు. లాక్‌‌డౌన్ కారణంగా అంత్యక్రియలకు వెళ్లలేని పరిస్థితి. దాంతో వీడియో ద్వారా అంత్యక్రియ లు చూసి కుమిలిపోయారు ఇర్ఫాన్. అంతలోనే ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్పించా రు. ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు యాభై మూడేళ్ల ఇర్ఫాన్.

ఫ్యామిలీ గురించి

1995లో రచయిత్రి సుతాపాను పెళ్లి చేసుకున్నారుఇర్ఫాన్. వారికి ఇద్దరుకొడుకులు..బాబిల్, అయాన్. ఇర్ఫాన్‌ ‌గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు సుతాపా. పనిమీద తనఫోకస్ మామూలుగా ఉండదని, ఇంటికొచ్చాక కూడా తిన్నగా బెడ్‌‌రూమ్‌‌లోకి వెళ్లి, నేలమీదకూర్చుని పుస్తకాలుచదువు కుంటారని,నాలెడ్జ్ పెంచుకోవడం మీదే మనసుఉంటుందని, తెల్లవారు జామున మూడుగంటల వరకు కూర్చుని హోమ్‌‌వర్క్ చేస్తూ ఉంటారని, తనపాత్రని ఎలాపండించాలా అనే ఆలోచనతోనే అనుక్షణం ఉంటారని.. ఇలా చాలా విషయాలు చెప్పారామె.అందుకేనేమో.. ఆయన అంత గొప్ప నటుడయ్యింది!

ఎల్లలు దాటిన ప్రతిభ

ఇర్ఫాన్‌‌కి డబ్బు కోసమే నటించాలనే ఆలోచన లేదు. స్టార్‌డమ్‌పై ఆశ అస్సలు లేదు. ఉన్నదల్లా నటనపై చెప్పలేనంత మక్కువ. పాత్ర కోసం ఏమైనా చేయగలిగేంత తెగువ. అందుకే ఏ రోజూ తెరపై ఆయన కనిపించలేదు. ఆయన చేసిన పాత్రలు మాత్రమే కనిపిం చాయి. ‘సలామ్‌బాంబే’తో బాలీవుడ్‌‌కి పరిచయమైన ఇర్ఫాన్.. హాసిల్, మక్బూల్‌, డీ డే, ద లంచ్‌బాక్స్, పీకూ, తల్వార్, జజ్‌‌బా, మడారి, హిందీ మీడియమ్, బ్లాక్‌‌ మెయిల్, కార్వాన్ వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు. దేశం గర్వించదగ్గ గ్రేట్ యాక్టర్ అనిపించుకున్నారు. ‘పాన్‌సింగ్‌తోమర్‌’లోని నటనకు గాను జాతీయ అవార్డును సైతం అందుకున్నా రు. ఆయనలోని గొప్పనటుణ్ని విదేశీ ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడ్డారు . అందుకే ఇర్ఫాన్‌ ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా ఇంగ్లీష్  సినిమాలు కనిపిస్తాయి. ఎ మైటీ హార్ట్, హార్ట్ ద నేమ్ సేక్, స్లమ్‌డాగ్ మిలియనీర్, ద అమేజింగ్ స్పైడర్‌‌‌‌మేన్, లైఫ్‌ ఆఫ్‌ పై, జురాసిక్ వరల్డ్, పజిల్ వంటి ఇంగ్లిష్‌ మూవీస్‌‌ఇర్ఫాన్‌‌ని నటుడిగా మరిన్ని మెట్లు ఎక్కించాయి. ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు ఏరి కోరి వరించాయి. రెండుసార్లు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ పురస్కారాలూ అందాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఇర్ఫాన్‌‌ను గౌరవించింది.

తెలుగులో నటించింది ఒక్కసినిమానే

ఇర్ఫాన్‌‌ తెలుగులోనటించిన ఒకే ఒక్క సినిమా ‘సైనికుడు’.మహేష్‌‌బాబు, త్రిషజంటగానటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. పప్పుయాదవ్ అనే క్రిమినల్ పొలిటీషియన్‌ ‌పాత్రను తనదైన శైలిలో పండించి మెప్పించారు ఇర్ఫాన్. ఎందుకో గానీ ఆతర్వాత ఆయన తెలుగులో నటించలేదు. ఇర్ఫాన్‌‌మృతి వార్త తెలియగానే మహేష్‌‌‘ఇర్ఫాన్ మరణవార్త నన్ను చాలాబాధకి గురిచేసింది. ఒక బ్రిలియంట్ యాక్టర్ ను  ఇంత త్వరగా కోల్పోతామని ఊహించలేదు. ఆయన్ని ఎప్పటికీ మిస్సవుతూనే ఉంటాం’ అంటూ ట్వీట్ చేశాడు.   పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.