
- రిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గరిడేపల్లి, నేరేడుచర్ల, వెలుగు: రోడ్లు నాణ్యతతో పాటు వేగవంతంగా నిర్మించాలని, నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గానుగబండ, కల్మలచెరువు గ్రామాల్లో రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గానుగబండ గ్రామంలోని దుర్గామాతను దర్శించుకున్న మంత్రి ఉత్తమ్ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. నేరేడుచర్ల పట్టణంలోని జాన్ పహాడ్ రోడ్‌లో ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.41.25 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆర్డీవో శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ రెడ్డి పాల్గొన్నారు.
హుజూర్ నగర్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బూరుగడ్డలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గూడెపు శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోవిందపురం హుజూర్ నగర్ నడుమ రూ.2 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర చాలా గొప్పదన్నారు. ఆర్డీవో శ్రీనివాసులు, ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,యరగాని నాగన్న గౌడ్,ఈడ్పుగంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.