చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉందా.. జూన్ నెలలో ఏం జరగబోతుంది

 చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉందా.. జూన్ నెలలో ఏం జరగబోతుంది

చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉందా.. ఈ సందేహం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరపెడుతోంది. కరోనా వైరస్ తో ఇప్పటికే అనూహ్య పరిణామాలను చవిచూసిన జనం.. ఇప్పుడు మరోసారి కరోనా మరో వేవ్ పై భయాందోళనలకు గురవుతోంది. దీంతో చైనా ఇప్పట్నుంచే వ్యాక్సిన్ల కోసం పరుగులు పడుతోంది. గత సంవత్సరం చైనా "జీరో కోవిడ్" విధానాన్ని తొలగించింది.  ఈ నేపథ్యంలో అధికారుల అంచనాలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వేవ్ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. వారానికి 65మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కరోనా కొత్త వేవ్ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం చైనా కొత్త వేరియంట్ల కోసం టీకాలను సిద్ధం చేస్తోంది. చైనాలోని మూడు కొత్త వేరియంట్లను (ఎక్స్ బీబీ 1.9.1, ఎక్స్ బీబీ 1.5, ఎక్స్ బీబీ 1.16) అడ్డుకునే టీకాలకు ప్రాథమిక అనుమతి ఇచ్చామని చైనా అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. మరో మూడు, 4 టీకాలకు కూడా త్వరలోనే అనుమతులు రానున్నట్టు వెల్లడింతచారు.