ఫ్యాక్ట్ చెక్: శానిటైజ‌ర్ల వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు, కేన్స‌ర్లు వ‌స్తాయా?

ఫ్యాక్ట్ చెక్: శానిటైజ‌ర్ల వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు, కేన్స‌ర్లు వ‌స్తాయా?

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కోసం పాటించే జాగ్ర‌త్త‌ల వ‌ల్ల కొత్త జ‌బ్బులు వ‌చ్చే ముప్పు ఉందా? రోజూ శానిటైజ‌ర్ తో చేతులు శుభ్రం చేసుకుంటే చ‌ర్మ‌వ్యాధులు, కొన్ని ర‌కాల కేన్సర్ల బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉందా? అంటే అవునంటూ ఇటీవ‌ల కొన్ని మీడియా సంస్థ‌లు, సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో దీనిపై కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. నిజానిజాల‌ను వెల్ల‌డిస్తూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అటువంటి ప్రమాద‌మేదీ లేద‌ని తేల్చి చెప్పింది.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. ఈ వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేయ‌డానికి సోష‌ల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్కు ధ‌రించ‌డం, శానిటైజ‌ర్ వాడ‌డం లాంటివి చేయాల‌ని అన్ని దేశాలు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. వైర‌స్ ఒక్కరి నుంచి మ‌రొక‌రికి అంటుకోకుండా త‌ర‌చూ చేతుల‌ను శానిటైజ‌ర్ లేదా స‌బ్బుతో త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకోవాల‌ని చెబుతున్నాయి. అయితే 50, 60 రోజుల పాటు వ‌రుస‌గా శానిటైజ‌ర్ల‌ను వాడ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర చ‌ర్మ వ్యాధులు, కేన్స‌ర్లు వ‌స్తాయంటూ ఇటీవ‌ల కొన్ని వార్తా క‌థ‌నాలు ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. ఆల్క‌హాల్ తో పాటు అందులో ఉండే కెమిక‌ల్స్ వ‌ల్ల ఈ జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నాయి. దీనిపై ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొన‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి క్లారిటీ చేసింది. ఈ స‌మా‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, హ్యాండ్ శానిటైజ‌ర్లు వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌ద‌ని తెలిపింది. క‌రోనా నుంచి కాపాడుకునేందుకు త‌ర‌చూ 70 శాతం ఆల్క‌హాల్ తో కూడిన హ్యాండ్ శానిటైజ‌ర్ ను వాడాల‌ని సూచించింది.