
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో షురూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు యూనిట్ సభ్యుల నుంచి సమాచారం. ఇప్పటికే, అందుకు తగ్గ ఏర్పాట్లు కంప్లీట్ చేస్తున్నట్లు టాక్. ఇక మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ కానున్నాడు. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ తన కొత్త లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాడు.
అలాగే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం SSRMB 29 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీకి ‘GOLD’ అనే టైటిల్ ను రాజమౌళి బృందం పరిశీలిస్తున్నట్టుగా సినీ సర్కిల్ నుంచి సమాచారం. అంతేకాకుండా ఎప్పటి నుంచో 'మహారాజ్' అనే టైటిల్ కూడా వినిపిస్తోంది.
అయితే, ఈ రెండు టైటిల్స్ ఆజానుబాహుడు లాంటి మహేష్ కు తగ్గట్టుగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని కొందరు అంటుండగా..రాజకుమారుడి లాంటి మహేష్ కు మహారాజ్ అనే టైటిల్ కూడా సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో రాబోయే మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రాజమౌళి SSRMB 29 నుంచి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.