ఇరాన్ పై యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన యూఎస్ ఇంటెలిజెన్స్ కు చెందని కీలక డాక్యుమెంట్లు టెలిగ్రామ్ లో లీక్ అయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక, డ్రోన్ బృందాలు ఇరాన్ పై దాడికి సిద్దమవుతున్నట్లు యూఎస్ డాక్యుమెంట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతా ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూఎస్ అధికారులు.
ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సైనిక సన్నాహాలకు సంబంధించి రెండు ఆధారాలకు సంబంధించిన US ఇంటెలిజెన్స్ పత్రాలు ఇరాన్‌తో అనుసంధానించబడిన టెలిగ్రామ్ ఖాతాలో లీక్ అయ్యాయి. ఇది US రక్షణ వర్గాలలో అలెర్ట్ పెంచిందని అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ Axios తెలిపింది.
ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించిన రెండు కీలక యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాలు ఇరాన్ తో సంబంధం ఉన్న టెలిగ్రామ్ ఖాతాలో లీక్ అయ్యాయి. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ తన యుద్ద సన్నాహాలకు సంబంధించిన కీలక విషయాలను బహిర్గతం చేశారు.
ఇజ్రాయెల్ ప్రతిచర్యను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఉల్లంఘన జరిగి ఉండొచ్చని Axios తెలిపింది. అయితే దీనిపై పెంటగాన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం ఎటువంటి ప్రకటనలు చేయలేదు.
ఇరానియన్ అనుకూల టెలిగ్రామ్ ఛానెల్ అయిన మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్ చేతికి ఇజ్రాయెల్ కార్యాచరణ ఉద్దేశాలను వివరించే ఒక అమెరికన్ ఇంటెలిజెన్స్ కు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి.
అధికారిక ప్రతిచర్యలు
యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాలు లీక్ విషయంలో అమెరికా అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లీక్ నిజమే.. త్వరలో చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ లోని సీనియర్ రక్షణ అధికారి చెప్పారు.