పనస పండ్లు తింటే బీపీ కంట్రోల్ అవుతుందా..

పనస పండ్లు తింటే బీపీ కంట్రోల్ అవుతుందా..

జాక్‌ఫ్రూట్.. తెలుగులో దీన్నే పనస పండు అంటారు. మోరేసి అనే కుటుంబానికి చెందిన ఈ పండు.. భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ప్రసిధ్ది గాంచింది. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ఇది కనిపిస్తుంది. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జాక్‌ఫ్రూట్ పై భాగం, గింజల్ని కూరల్లోనూ విరివిగా వాడతారు. దీన్ని ఉడకబెట్టి లేదా పూర్తిగా పండినప్పుడు నేరుగా పండులాగానూ తింటారు. ఈ పండు చెట్టులోని వివిధ భాగాలైన పండ్లు, ఆకులు, బెరడుతో సహా అన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని సాంప్రదాయ వైద్యంలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు.

జాక్‌ఫ్రూట్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే.. ఇందులో పొటాషియం ఆధారిత లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాదు ఇది రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె, రక్త నాళాలపై సోడియం చూపించే హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవడంలోనూ తోడ్పడుతుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోకులు, ఎముకల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ B6 ఉండటం వల్ల రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు తగ్గుతాయి. 

జాక్‌ఫ్రూట్ అనేది మినరల్-రిచ్ ఫ్రూట్. ఇందులో అధిక మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం ఉండడం వల్ల శోషణకు సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తుంది. జాక్‌ఫ్రూట్‌ లోని ఐరన్.. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. సరైన రక్త ప్రసరణకు సపోర్ట్ చేస్తుంది.  

పనస పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు ఉన్నప్పటికీ దీన్ని తక్కువగా వాడుతారు. ఎందుకంటే దానిని పండించే ప్రాంతానికి కావాల్సిన ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడం, వాణిజ్యపరంగానూ ఇబ్బందుల వల్ల దీని వాడకం కాస్త తక్కువగా ఉంటుంది.

మిగతా పోషకాలు ఎలా ఉన్నా.. పనస పండు తినటం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుందని.. కోపం తగ్గి కూల్ గా ఉంటారనేది.. అందులోని పోషకాల ద్వారా స్పష్టం అవుతుంది. ఫ్రూట్ ఏదైనా ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఒక్కో ఫ్రూట్ తినటం వల్ల ఒక్కో ప్రయోజనం ఉంటుంది. పనస పండు తినటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు..