ఆన్లైన్ క్లాసులు వింటున్న సీనియర్ హీరో.. అందుకోసమేనా..?

ఆన్లైన్ క్లాసులు వింటున్న సీనియర్ హీరో.. అందుకోసమేనా..?

తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషలలో హీరోగా నటించి మెప్పించిన ప్రముఖ సీనియర్ హీరో కమల్ హాసన్ గురించి  తెలియనివారుండరు. అయితే కమల్ హాసన్ ఈ మధ్యకాలంలో నటనపరంగా కొంతమేర ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది. ఆ మధ్య తాను హీరోగా నటించిన విక్రమ్ చిత్రం మంచి హిట్ అవ్వడంతో యాక్షన్ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటించేందుకు మొగ్గు చూవుతున్నాడు. 

తాజాగా కమల్ హాసన్ కి సంబంధించిన ఓ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకోవడం కోసం కమల్ హాసన్ అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో చేరినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

అయితే కమల్ హాసన్ ప్రస్తుతం మలయాళీ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్స్ లైఫ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ ఏఐ నేర్చుకుని ఆ స్కిల్స్ ని చిత్ర షూటింగ్ సమయంలో ఉపయోగించుకోనున్నట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.


ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘానా సాధించింది.