బెడ్రూం మాటలు వినడం డిగ్నిటీనా? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్

బెడ్రూం మాటలు వినడం డిగ్నిటీనా? కేటీఆర్కు బండి సంజయ్  కౌంటర్
  • చెప్పులెత్తుకుపోయే కల్చర్ మాది కాదు
  • గురువుల కాళ్లు బరాబర్ మొక్కుతా
  • బీజేపీ లీడర్లు అమిత్​ షా చెప్పులు 
  • మోస్తున్నారన్న కేటీఆర్​ కామెంట్లపై ఫైర్​

హైదరాబాద్, వెలుగు: సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిన తల్లిదండ్రులు, గురువుల కాళ్లు బరాబర్ మొక్కుతామని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పాదాభివందనం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. అవసరమైతే గురువుల చెప్పులు కూడా తీస్తామని, అందులో తప్పేమీ లేదన్నారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్ష- బహుమతి ప్రదానోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు కాలేజీ ఆవరణలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం సంభాషణలను వినడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా..? ఫార్ములా ఈ-–రేస్, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల పేరుతో దోచుకోవడమేనా..? ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమేనా.. డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే?’’ అని ఆయన ప్రశ్నించారు. 

డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఏమిటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కాబట్టే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ‘‘మీ లెక్క కాళ్లు గుంజి చెప్పులు ఎత్తుకుపోయే కల్చర్ మాది కాదు. మంది కొంపలు ముంచే విలువలు మాకు మా గురువులు నేర్పలేదు’’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నయాపైసా లాభం లేదు..

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమిట్ పేరుతో రూ.100 కోట్లు ఖర్చు చేసి సాధించిందేమీ లేదని బండి సంజయ్ విమర్శించారు. ఈ సమిట్ వల్ల తెలంగాణకు నయాపైసా లాభం జరగలేదన్నారు. రాహుల్ గాంధీ ఒక చెల్లని రూపాయి అని, విదేశాల్లోని చెల్లని రూపాయలను తీసుకొచ్చి ఇక్కడ సమిట్ పెడితే ఎవరూ నమ్మరని మండిపడ్డారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం పైసలివ్వలేదని విమర్శించారు. 

పురుగులమందులతో కీడు ఎక్కువ..

పురుగుల మందులతో వ్యవసాయం చేయడం వల్ల సమాజానికి మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతోందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాలతో పండించే ఆహారం తినడంతో కడుపులో ఉన్న పిండం నుంచే కలుషితమవుతోందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని, గోమాతను విస్మరించడం వల్లే నేడు నగరాలు, పట్టణాల్లోకే కాకుండా గ్రామాల్లోకి కూడా పాల ప్యాకెట్లు, పాల పౌడర్ డబ్బాలు వచ్చాయని తెలిపారు. పురుగులమందుల సాగు వద్దు.. కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డ్రగ్స్ నిర్మూలన డైరెక్టర్ జి. రాంధర్, బి. సుందర్ రెడ్డి, గోసేవ అఖిల భారతీయ సంయోజక్ అజిత్ ప్రసాద్ మహాపాత్ర, నివాస్ తదితరులు పాల్గొన్నారు.