మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్ అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..

మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్  అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..

సాధారణంగా మన మొబైల్ ఫోన్లకు మేసేజ్లు చాలా వస్తుంటాయి. ప్రతి రోజూ క్రెడిట్ కార్డు ఆఫర్లు, లోన్ ఆఫర్లు అంటే ఫోన్లకు మెసేజ్ల మోగుతూనే ఉంటుంది. ఆయా బ్యాంకులు, కంపెనీలు పంపించే మేసేజ్ లలో ఏదీ అసైలైనది..ఏది నకిలీదో కనుగొనడంలో ఇబ్బంది పడుతుంటాం.. తద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఈ మెసేజ్ లు నకిలీవో..అసలైనవో ఎలా తెలుసుకోవాలో చూద్దాం.. 

మన మొబైల్ ఫోన్లకు వచ్చే మేసేజ్లలో మొదటి రెండు అక్షరాల తర్వాత ఆరు క్యారెక్టర్లు ఉంటాయి..వీటిని హెడ్డర్లు అంటారు. వీటి ఆధారంగామేసేజ్ వచ్చినప్పుడు అది అసలుదా? నకిలీదా అని మనం తెలుసుకోవచ్చు. DETAILS OF XXXXXX( అంటే హెడ్డర్లలో ఉండే ఆరు క్యారెక్టర్లు )లను 1909 కి మేసేజ్ చేనినట్లయితే అది ఏ కంపెనీ నుంచి వచ్చిందో ఈజీగా చెప్పేస్తుంది. మీకు వచ్చిన మేసేజ్ లపై ఎటువంటి అనుమానం కలిగినా ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.