ఉస్మానియా ఆసుపత్రి పురావస్తు భవనమా? కాదా ?

ఉస్మానియా ఆసుపత్రి పురావస్తు భవనమా? కాదా ?

హైద‌రాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రి పురావస్తు భవనమా? కాదా? అని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది . ఉస్మానియా ఆసుపత్రి
కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జ‌రిపింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కూల్చివేయాలని ఓ వాదన ఉండగా, పురాతన భవనమంటూ వాదన ఉందని తెలిపింది. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ. 6 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని తెలుసుకుని చెబుతామని ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ పిటీష‌న్‌పై తదుపరి విచారణను ‌కోర్టు ఆగస్టు 4కి వాయిదా వేసింది.

Is Osmania Hospital an Archaeological Building? Is it not? : High Court questioned Telangana state government