ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పొంగులేటి బహిరంగ చర్చకు సిద్ధమా..? : తాతా మధుసూదన్​

ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  పొంగులేటి బహిరంగ చర్చకు  సిద్ధమా..? :  తాతా మధుసూదన్​

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ సవాల్​విసిరారు. పొంగులేటి స్వగ్రామంలో నారాయణపురంలోని ఆయన 40 ఎకరాల మామిడితోటకు ఉచిత విద్యుత్ అందుతుందా లేదా అని మాజీ ఎంపీని ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ ​ఆఫీసులో తాతా మధుసూదన్​ మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రాజకీయాలను కలుషితం చేస్తున్న పొంగులేటికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. పార్టీ ద్వారా ఆర్థికంగా లబ్ధిపొందిన ఆయన.. గత ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకుడయ్యాడన్నారు.  పార్టీలో పొంగులేటికి సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదని, ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పక తీసుకుంటుందన్నారు.

ఉమ్మడిజిల్లాలో పార్టీ తన వల్లే పటిష్టంగా మారిందని పొంగులేటి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొంగులేటి ఎంపీగా యాదృచ్ఛికంగా గెలిచాడని, ఈక్రమంలో ఆయన తన స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఆరోపించారు. అనేక వేదికల మీద 24గంటలు కరెంట్​ ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్​ అని పొగిడిన పొంగులేటి, ఈ రోజు విమర్శించడంలో అర్థం లేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం పార్టీలో చేరిన పొంగులేటి... 2014కు ముందు తన ఆర్థిక స్థితి ఏంటో గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. టైం వచ్చినపప్పుడు అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. మీడియా సమావేశంలో జడ్పీ చైర్మన్​ కమల్​రాజు, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, మేయర్​ నీరజ, సుడా చైర్మన్​ విజయ్​,  విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్​ కోటేశ్వరరావు, నాగరాజు, కమర్తపు మురళీ, శేషగిరిరావు, ఖమర్​, ఆష్రిఫ్ పాల్గొన్నారు.