చావుల్లో కూడా తేడాలా..? పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా ?

చావుల్లో కూడా తేడాలా..? పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా ?
  • కేసీఆర్ కు వైఎస్ షర్మిల ప్రశ్న

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చావుల్లో కూడా తేడాలా..? పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా ? అని ఆమె ప్రశ్నించారు. రైతుల చావులంటే పట్టింపు లేదా.. లేక అడిగేవారు లేరనా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆగలేదు కానీ..రైతులు మాత్రం ఎక్స్ గ్రేషియా కోసం ఎందుకు ఆగాలి? అంటూ షర్మిల నిలదీశారు. 
సీఎం KCR ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో 7 వేల 600 మంది రైతులు చనిపోతే ఇప్పటి వరకు 1600 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. పరిహారం రాని మిగతా 6వేల మంది పరిస్థితి  ఏంటని షర్మిల ప్రశ్నించారు. చావుల్లో కూడా తేడాలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతు ఆత్మహత్యలన్నింటికీ కేసీఆరే కారణమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆగిందిలేదు కానీ రైతులు చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఏండ్ల తరబడి ఎందుకు ఆగుతున్నారని ట్వీట్ చేశారు షర్మిల. 

 

 

ఇవి కూడా చదవండి:

కేటీఆర్ కు రాజాసింగ్ బహిరంగ లేఖ

జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూత

తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు