డెంగీకి వ్యాక్సిన్​ ఉందా? సోకితే లక్షణాలు ఏంటి?

డెంగీకి వ్యాక్సిన్​ ఉందా? సోకితే లక్షణాలు ఏంటి?

వానాకాలం వస్తే జలుబు, జ్వరం రావడం మామూలే. ఇవి సీజనల్​గా వచ్చేవే అని నిర్లక్ష్యం చేయొద్దు. అసలే ఎక్కడ కరోనా థర్డ్ వేవ్​ దాడి చేస్తుందోనని ప్రపంచదేశాలు వణికి పోతున్నాయి. కానీ, వ్యాక్సిన్ వల్ల భయం నుంచి కొంత రిలీఫ్​ దొరుకుతున్నట్టే అనిపిస్తుంది. అయితే ఈ వానాకాలంలో వచ్చే డెంగీ ఫీవర్​తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరోనా లాగే డెంగీకి కూడా మెడిసిన్​ లేదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముప్పు తప్పినట్టు. రోగం వచ్చాక ట్రీట్​మెంట్​ గురించి ఆలోచించడం కంటే... దాని బారిన పడకుండా ఉండటం మేలు అంటున్నారు డాక్టర్లు. 

డెంగీ వచ్చినవాళ్లకి ఫీవర్​,వాంతులు, లూజ్​ మోషన్స్​, బాడీ, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. దోమ కుట్టిన తర్వాత రెండు రోజుల లోపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది మామూలు జ్వరమే, కొంతమందిలో అయితే వచ్చినట్లు కూడా తెలీదు. డెంగీ రావడానికి కారణం ‘ఏడిస్​​ ఈజిప్టై’, ‘ఏడిస్​ ఎల్బోపిక్టస్’ అనే  రెండు రకాల దోమలు. ఏడిస్​ ఎల్బోపిక్టస్ ఈ దోమలు మనిషికీ మనిషికి మధ్య వెక్టార్​లాగా పనిచేస్తాయి. అంటే దోమ కుడితే వైరస్ దానిలోకి చేరుతుంది. అదే దోమ వేరొక హెల్దీ పర్సన్​కి కుట్టినప్పుడు ఆ వైరస్ బాడీలోకి వెళుతుంది. అయితే డెంగీ సోకిన వ్యక్తుల్లో మూడురకాల లక్షణాలు కనిపిస్తాయి. క్లాసికల్​, సివియర్, ఏటిపికల్​.

క్లాసికల్​ – 5 నుంచి 7 రోజుల్లో ఎక్కువ జ్వరం వస్తుంది. టెంపరేచర్​ వంద పైగా ఉంటుంది. నార్మల్​ మెడిసిన్​కి బాడీ రియాక్ట్ అవ్వదు. బాడీ పెయిన్స్​, జాయింట్​ పెయిన్స్​, మోషన్స్, తలనొప్పి ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ‘బ్రేక్​ బోన్​ ఫీవర్’ అని కూడా అంటారు. ఎముకలు అరిగినట్టు నొప్పి వస్తుంది. దాదాపు వారం రోజులు జ్వరం వస్తుంది. ఒక్కోసారి సడెన్​గా తగ్గిపోతుంది కూడా. అలా ఫీవర్ తగ్గిందంటే, ప్లేట్​లెట్స్​ పడిపోవడం, లేదా ఇతర ఇబ్బందులేవైనా తలెత్తడం జరుగుతుంది. ఇంకొందరికి ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. మూడు నాలుగు రోజులు గమనించాలి. సడెన్​గా తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతి నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, ముక్కు, నోరు, యూరిన్​, మోషన్​లో రక్తస్రావం అవడం జరుగుతాయి. ఇవన్నీ జ్వరం తగ్గిపోయినప్పుడు, సడెన్​గా ప్లేట్​లెట్స్ తగ్గిపోవడం వల్ల వచ్చేవి. వీటిని వార్నింగ్​ సిగ్నల్స్​ అంటారు. ఇలాంటివి వస్తే వెంటనే మెడికల్​ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవేమీ రాకపోతే, పడిపోయిన ప్లేట్​లెట్స్ మళ్లీ నార్మల్​ కౌంట్​కి వచ్చేస్తాయి. ఇది వారం రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది.

సివియర్​ –  ఇందులో  డెంగీ హెమరైజిక్​ ఫీవర్​, డెంగీ షార్ప్​ సిండ్రోమ్ అని రెండు రకాలుం టాయి. రెండింటి వల్ల మల్టిపుల్​ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే రకరకాల అవయవాలు డ్యామేజ్​ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పేషెంట్​ లైఫ్​కి​ ప్రమాదం.​ దీనివల్ల దాదాపు ఐదు శాతం మంది ఎఫెక్ట్​ అవుతారు. 

ఏటిపికల్ – ఒక అవయవానికి ఎక్కువ డేమేజ్​ అవ్వడం. బ్రెయిన్, లివర్​, లంగ్​ డ్యామేజ్​​, కొవిడ్ లక్షణాలు, హార్ట్ డ్యామేజ్​లతో వస్తుంటారు. దీనివల్ల పేషెంట్​ లైఫ్​కి చాలా ప్రమాదం. కొన్ని రీసెర్చ్​లలో యాంటీసైక్లిన్​ అనే యాంటీ బయాటిక్​ ఉంది. అది కొంతవరకు పని చేస్తుందని తెలిసింది. యాంటీ వైరల్ ఏమీ లేదు. ఇప్పుడయితే శ్వాససంబంధిత సమస్యల కోసం మెడిసిన్ ఇస్తున్నారు. 

గర్భిణీల​కి డెంగీ వస్తే...
ప్రెగ్నెంట్స్​కి డెంగీ వస్తే మెటర్నల్​, ఫీటల్​​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. తల్లికి లో– బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. డీ–హైడ్రేషన్ వల్ల గర్భ సంచిలో నీరు తగ్గుతుంది. ప్లేట్​లెట్స్​ తగ్గడం వల్ల ఇంటర్నల్​ బ్లీడింగ్ అవుతుంది. లంగ్స్​లో నీరు చేరే అవకాశం ఎక్కువ. డెంగీ వల్ల ప్రెగ్నెన్సీ పొయే ప్రమాదం ఉంది. సిజేరియన్ చెయ్యాల్సిన అవకాశాలు ఎక్కువ.

డెంగీకి వ్యాక్సిన్​ ఉందా?
ఈ మధ్య కొన్ని కంపెనీలు డెంగీకి వ్యాక్సిన్​ తయారు చేసేందుకు రెడీ అయ్యాయి. విదేశాల్లో ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో డెంగీకి వ్యాక్సిన్​ వచ్చే అవకాశం ఉంది. సీజనల్​గా వచ్చే ఫ్లూకి ఎలాగైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో డెంగీకి కూడా వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుంది. డెంగీ అని మొదటి రోజు గుర్తించలేం. ల్యాబ్​ రిపోర్ట్ బట్టే తెలుస్తుంది. మొదటిరోజుల్లో యాంటీ ఎన్​ఎస్​ –1 అనే యాంటిజెన్​ ఉంటుంది. మూడోరోజు డెంగీ అని తెలుస్తుంది. నాలుగో రోజు డెంగీ ఐజియం యాంటీ బాడీస్ చూడాలి. 

జాగ్రత్తలు

  • ఇంటి పరిసరాల్లో చెత్తా చెదారం, నీళ్లు నిల్వ ఉంటే మున్సిపాలిటీ వాళ్లకి చెప్పి క్లీన్​ చేయించాలి. 
  • తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. 
  • కిచెన్, బయో వేస్ట్​లు ఇంట్లో ఉంచొద్దు.  వైరస్​లు అక్కడే వేగంగా పెరుగుతాయి.
  • తెల్లవారుజాము నుంచి సూర్యా స్తమయం వరకూ డెంగీ దోమలు తిరుగుతుంటాయి. బయటికెళ్లేటప్పుడు ఫుల్​ స్లీవ్స్​ ఉండే డ్రెస్​లు వేసుకోవాలి. 
  • ఉదయంపూట డెంగీ దోమలు కుట్టే అవకాశం ఎక్కువ. 
  • మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్​లు రాసుకోవాలి. లివర్, లంగ్స్ డిసీజెస్, డయాబెటిస్​ వంటి వ్యాధులున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 

- మనీష పరిమి

కరోనా వచ్చిన వాళ్లకి డెంగీ వస్తే... 
కరోనా, డెంగీ రెండూ ఒకేసారి వస్తే దాన్ని ‘డ్యూయెల్ ఇన్ఫెక్షన్​’ అంటారు. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. లక్షణాలు అన్నీ కొవిడ్​, డెంగీ రెండిటికీ లక్షణాలు ఒకేలా ఉంటాయి. వాటిని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటోంది. వీటిని అడ్డుకోవాలంటే కచ్చితంగా వ్యాక్సిన్​ వేయించుకోవాలి. వ్యాక్సిన్​ వల్ల కొవిడ్, డెంగీలు వచ్చినా ప్రమాదం తక్కువే. రెండూ ఒకేసారి వస్తే ఆర్గాన్​ డ్యామేజ్​ జరుగుతుంది. కొవిడ్​ తగ్గాక, డెంగీ వచ్చినవాళ్లకి రెసిస్టెన్స్ పవర్​ తక్కువ ఉంటుంది. అలాగే స్టిరాయిడ్స్ వాడేవాళ్లకి డెంగీ వస్తే ‘మల్టిపుల్ ఆర్గాన్​ ఫెయిల్యూర్’ అయ్యే ప్రమాదం ఉంది. మరికొన్ని స్టడీలలో అయితే డ్యూయెల్​ ఇన్ఫెక్షన్​ వచ్చిన వాళ్లకి టెస్ట్ చేస్తే నెగెటివ్​ రిపోర్ట్​ వస్తున్నాయని తేలింది. అలాంటప్పుడు సిటిస్కాన్​ చేసి లేదా రోగి లక్షణాలను బట్టి గుర్తిస్తారు. మైల్డ్​ డెంగీ, కొవిడ్ ఉన్నవాళ్లలో పాజిటివ్​ రిపోర్ట్​ చూపిస్తుంది. 
- డా. రాహుల్​ అగర్వాల్​, సీనియర్ కన్సల్టెంట్​, కేర్​ హాస్పిటల్, హైదరాబాద్