కరోనా ఎఫెక్ట్: ఈఎంఐ వాయిదాతో ఫాయిదా ఉందా?

కరోనా ఎఫెక్ట్: ఈఎంఐ వాయిదాతో ఫాయిదా ఉందా?

మారిటోరియంపై బ్యాంకుల సూచనలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో నష్టపోతున్న ప్రజలకు, వ్యాపారులకు కాస్త ఊరటనిచ్చేందుకు ఆర్‌బీఐ రుణాల ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మారటోరియం లాభమా..? నష్టమా..? అని చూసుకుంటే… చాలా మంది మారటోరియం ఎంచుకోకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. మారటోరియం వల్ల అదనంగా భారం భరించాల్సి వస్తుందంటున్నారు. ఈఎంఐలు చెల్లించగలిగే సామర్థ్యమున్న వారు పేమెంట్లు చేయాలని బ్యాంక్‌లు కూడా బారోవర్స్‌‌కు సూచిస్తున్నాయి. ఒకవేళ అలా కాకుండా.. ఎలాగో ఆర్‌బీఐ
అనుమతి ఇచ్చింది కదా అని మారటోరియాన్ని ఎంచుకుంటే, బారోవర్స్ కాస్త అదనంగానే భారాన్ని భరించాల్సి వస్తుందని బ్యాంక్‌లు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌‌బీఐ తన కస్టమరకు పలు సూచనలు చేసింది. చెల్లించే సామర్య్థముంటే.. చెల్లించండి అంటూ బారోవర్స్ కు సూచిస్తోంది. అయితే మారటోరియం తర్వాత బారోవర్స్‌‌కు అదనంగా భారం ఎలా పడుతుందో కూడా బ్యాంక్‌లు
కస్టమర్లకు వివరిస్తున్నాయి. బ్యాంక్‌లు జారీచేస్తోన్న నియమ, నిబంధనలు చూడకుండా మారటోరియాన్ని ఎంచుకుంటే నష్టపోక తప్పదని కూడా ఎనలిస్ట్‌‌లు సూచిస్తున్నారు. మారటోరియం కాలంలో టర్మ్‌ లోన్‌ అవుట్‌‌స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ అలానే కొనసాగుతోంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్‌కి కలుస్తుంది. దీంతో మనం పెరిగిన అమౌంట్‌పై వడ్డీ కట్టాల్సి వస్తుంది.ఈ టేబుల్‌‌ను గమనిస్తే.. మనం ఎంత మేర అదనంగా భారాన్ని భరించాల్సి వస్తుందో సులువుగా అర్థమవుతుంది.

ఎస్‌‌బీఐ చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి…
ఒకవేళ బ్యాంక్ నుంచి కనుక రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుని.. మరో 15 ఏళ్లలో దీని మెచ్యూరిటీ ఉంటే దీనిపై అదనంగా రూ.2.34 లక్షల
మేర వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంటే ఈ మొత్తం ఎనిమిది నెలల ఈఎంఐలకు సమానం. అంటే ఎనిమిది నెలల ఈఎంఐను అదనంగా కడుతున్నట్టు. రూ.6 లక్షల ఆటో లోన్ ఉండి, మరో 54 నెలల మెచ్యూరిటీ ఉంటే… అదనంగా రూ.19 వేల వడ్డీని చెల్లించాలి. అంటే 1.5 ఈఎంఐలను అదనంగా
చెల్లించాలని ఎస్‌‌బీఐ వివరించింది. ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవాలంటే.. ఈఎంఐలను ఎలాంటి మారటోరియం లేకుండా చెల్లించుకోవడమే మంచిదని సూచిస్తోంది. కానీ ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉండి, మారటోరియం ఫెసిలిటీని వాడుకోవాలనుకుంటే, అదనపు భారం భరించాల్సి వస్తుందని ఎస్‌‌బీఐ ఎండీ(రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ఆర్‌బీఐ సూచన మేరకు ఎస్‌‌బీఐ కూడా తన కస్టమర్లకు మారటోరియం ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మారటోరియం ఆఫర్ చేస్తూనే పలు సూచనలు కూడా చేస్తోంది.

ఆప్ట్ అవుట్ మీరే చేసుకోవాలి…
కొన్ని బ్యాంక్‌లు డిఫాల్ట్గా గా మారిటోరియాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇది కస్టమర్లకు మరింత ప్రమాదం. దీన్ని మీరు ఆప్ట్ అవుట్ చేసుకోవాలి.
బ్యాంక్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా బ్యాంక్ బ్రాంచ్‌లకు కాల్ చేసి మారటోరియం వద్దని చెప్పాల్సి ఉంటుంది. ట్యాక్స్‌‌ లపై కూడా కస్టమర్లు జాగ్రత్త
వహించాలి.

కట్ అయితే.. రీఫండ్ కోరవచ్చు…
ఇప్పటికే మార్చి నెల ఈఎంఐ చెల్లించిన వారు, మారటోరియం తీసుకోవాలనుకుంటే, ఈఎంఐను క్లయిమ్ బ్యాక్ పెట్టుకోవచ్చని శెట్టి తెలిపారు. ఈమెయిల్ ద్వారా రీఫండ్ కోరవచ్చని, ఆ మొత్తాన్ని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోకి జమ చేస్తోందని తెలిపారు. లోన్ అకౌంట్ ఎస్‌బీఐ వద్ద
ఉండి, మరో బ్యాంక్‌‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే, రీఫండ్ చేయడానికి కాస్తసమయం పట్టవచ్చని చెప్పారు. కానీ తప్పనిసరిగా డిడక్ట్ చేసిన మొత్తాన్ని క్రెడిట్ చేస్తామన్నారు.

For More News..

గంభీర్‌‌కు కోపం తెప్పించిన ‘ధోనీ సిక్సర్’

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు