India vs Afghanistan: న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కొత్త కుర్రాడు మానవ్ సుతార్ వేసిన స్పెల్ చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే!.. డెబ్యూ మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీసి ఆఫ్ఘన్ నడ్డి విరిచిన ఈ యంగ్ స్పిన్నర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
భారత జట్టా.. లేక గుజరాత్ టైటాన్స్ టీమా?:
నిజానికి టీమ్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది భారత జట్టా.. లేక గుజరాత్ టైటాన్స్ టీమా? అంతా ఆ జట్టులోని ప్లేయర్లనే తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో చాలా మంది హేళన చేస్తూ కామెంట్లు చేశారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి లెజెండ్స్ దూరమైనప్పుడు ఇలాంటి యువ క్రికెటర్లకు ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్లు నిరూపించుకునేది. ఇప్పుడు సుతార్ తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల నోళ్లు మూయిస్తూ గట్టి సమాధానం చెప్పాడు. ఇప్పటికైనా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ అనడం మానేస్తే బెటర్ అని క్రికెట్ లవర్స్ సూచిస్తున్నారు.
క్లాసిక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్:
ఇప్పటికైనా ఈ గుజరాత్ టైటాన్స్ ఆనే ట్యాగ్ తీసేసి మానవ్ సుతార్ టాలెంట్‌ను మెచ్చుకోవాలని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల మానవ్ సుతార్ ఒక పక్కా సాంప్రదాయక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్.. కేవలం బౌలింగే కాదు.. లోయర్ ఆర్డర్‌లో వచ్చి బ్యాట్‌తో కూడా రన్స్ కొట్టగల ఆల్‌రౌండర్ సుతార్.
రంజీ ట్రోఫీలోనే రచ్చ లేపిన మానవ్:
* 2022–23 రంజీ సీజన్: కేవలం 6 మ్యాచుల్లోనే 20.33 సగటుతో ఏకంగా 39 వికెట్లు పడగొట్టి అందరి కళ్లు తనవైపు తిప్పుకున్నాడు. ఆ సీజన్‌లో రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే.. ఇక బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో రెండు హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు.
* ఎమర్జింగ్ కప్ 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్‌లో 5 మ్యాచులాడి 19.50 యావరేజ్, 4.21 కిర్రాక్ ఎకానమీతో 10 వికెట్లు తీసుకున్నాడు. ఆ టోర్నీలో సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
* దులీప్ ట్రోఫీ 2024: దులీప్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు (7/49) తీసి మ్యాచ్ గెలిపించే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
►ALSO READ | ఈ-గేట్స్ యాడ్ ప్రచారంలో కోహ్లీ.. లండన్‌లో ఉంటూ ఇండియాలో సలహాలా? అంటూ ట్రోలింగ్
గుజరాత్ టైటాన్స్ తో కనెక్షన్:
ఐపీఎల్ 2024 వేలంలో మానవ్ సుతార్‌ను గుజరాత్ టైటాన్స్ (GT) కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది.. అది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ మనోడి టాలెంట్‌ను నమ్మిన గుజరాత్ మేనేజ్‌మెంట్.. మళ్లీ ఐపీఎల్ 2025 వేలంలో రూ. 30 లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో రచ్చ లేపిన రికార్డు ఉంది కాబట్టే ఇతడికి ఇండియా క్యాప్ దక్కింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే 22 ఓవర్లు వేసి, కేవలం 33 రన్స్ ఇచ్చి 6 వికెట్లు (6/33) పడగొట్టి తనను విమర్శించిన వాళ్లందరి ఫ్యూజులు అవుట్ చేసేశాడు.
