ప్రాణాలతో నన్ను చూడడం ఇదే చివరిసారేమో

ప్రాణాలతో నన్ను చూడడం ఇదే చివరిసారేమో

రష్యా ముప్పేట దాడుల నుంచి ఉక్రెయిన్ దేశాన్ని కాపాడుకునేందుకు దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కయ్‌ స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. రష్యా సైన్యానికి ఎదురొడ్డి పోరాడేలా ఉక్రెయిన్ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ.. సైనికుల వెన్నంటి నడుస్తున్న ఆయన నిన్న యురేపియన్ యూనియన్ నేతలతో కలసి మాట్లాడిన విషయం తెలిసిందే. రష్యా ఏకపక్షంగా యుద్ధానికి దిగిందని.. అండగా ఉంటాయని భావించిన నాటో దేశాలు, అమెరికాతోపాటు ప్రపంచ దేశాలన్నీ ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో యూరోపియన్‌ నేతలు తమకు అండగా నిలబడకపోయినా తాము వెన్నుచూపడం లేదని, ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని చెప్పిన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

యూరోపియన్ నేతలతో మాట్లాడిన సందర్భంగా  'మీరు నన్ను మీరు ప్రాణాలతో చూడటం బహుశా ఇదే చివరి సారేమో' అంటూ జెలెన్‌స్కయ్‌ ఒకింత ఉద్విగ్నంగా చెప్పిన్నట్లు సమాచారం. యూరప్‌ దేశాల వ్యవహారాలు రాసే సీనియర్ జర్నలిస్ట్‌ బరాక్‌ రావిడ్‌ కొద్ది సేపటి క్రితం ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోకాల్‌ను చూసిన ఇద్దరు సాక్షులు తనకు ఈ విషయం చెప్పినట్లు బరాక్‌ రావిడ్‌ పేర్కొన్నారు.

 

 

 

ఇవి కూడా చదవండి

మేడారం మూడో రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..

సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి