ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్.. ట్రంప్ కు ఏదో జరిగిందంటూ ప్రార్థనలు.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్.. ట్రంప్ కు ఏదో జరిగిందంటూ  ప్రార్థనలు.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం (జనవరి 21) వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్తుండగా.. ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్  విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 

మేరీల్యాండ్ లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో ఎలక్ట్రికల్ సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు.  అయితే విమానంలో సాంకేతిక లోపం  న్యూస్ తెలియగానే  ట్రంప్ భద్రత, ఆరోగ్యంపై అమెరికా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ క్షేమంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.    

ఈ ఘటనతో ప్రపంచ మంతా ట్రంప్ ఆరోగ్యం, భద్రతపై ఆందోళన రేకెత్తించింది. “ట్రంప్‌కు ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య తలెత్తిందా?” “ఇది కేవలం సాంకేతిక లోపమా లేక మరేదైనా జరిగిందా?” అంటూ కొంతమంది నెటిజన్లు X లో సందేహాలు వ్యక్తం చేశారు.  

ట్రంప్ భద్రత కోసం ప్రార్థనలు చేస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. “ఈ రాత్రి అధ్యక్షుడు ట్రంప్ భద్రత కోసం ప్రార్థించండి”.. “దేవుడు అధ్యక్షుడు ట్రంప్‌ను రక్షించుగాక” అనే పోస్ట్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లో వైరల్ అవుతున్నాయి.

అయితే ట్రంప్ భద్రత కోసం ప్రార్థనలు చేస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. “ఈ రాత్రి అధ్యక్షుడు ట్రంప్ భద్రత కోసం ప్రార్థించండి”.. “దేవుడు అధ్యక్షుడు ట్రంప్‌ను రక్షించుగాక” అనే పోస్ట్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లో వైరల్ అవుతున్నాయి.