
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఓజి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కి జోడీగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు, సింగర్ ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే గత రెండు రోజులు ఓజి సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వార్త ఏమిటంటే ఓజి సినిమాలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ సుజిత్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రకోసం సంప్రదించగా స్టోరీ విన్న ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఓజి సినిమా క్లైమాక్స్ లో 10 నిమిషాలపాటూ యాక్షన్ సీన్స్ లో కనిపిస్తాడని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ డైరెక్టర్ సుజిత్ లేదా ప్రభాస్ స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజమెంతుందనేది తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ఓజి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో సినిమాలకి టైం కేటాయించలేకపోయాడు. దీంతో సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఓజి వచ్చే ఏడాది ఏప్రిల్ కి వాయిదా పడింది. కానీ మార్చ్ లో పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉండటంతో ఏప్రిల్ కి రిలీజ్ చేయడం లేదని ఇటీవలే ఓజి చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఓజి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.