
న్యూఢిల్లీ: ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్‌లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సత్తా చాటుతోంది. శుక్రవారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో ఇషా టాప్ ప్లేస్ సాధించింది. 585 పాయింట్లతో టాప్‌లో నిలవగా, సిమ్రన్‌జీత్ కౌర్ బ్రార్ (583) రెండో స్థానంలో నిలిచింది. మను భాకర్ (582), అభింద్య పాటిల్ (577), రిథమ్ సాంగ్వాన్ (574) వరుసగా 3, 4, 5వ ప్లేస్‌లు సాధించారు. మెన్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో భవేశ్ షెకావత్ (580) అగ్రస్థానం సాధించాడు. విజయ్‌వీర్ (579), అనీశ్ (578) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శనివారం ఫైనల్స్ జరుగుతాయి.