వేలంలో రూ. 10 కోట్లకు పైగా పలికిన ఆటగాళ్లు వీళ్ళే..

వేలంలో రూ. 10 కోట్లకు పైగా పలికిన ఆటగాళ్లు వీళ్ళే..

ఐపీఎల్ వేలం ఈ సారి ఆసక్తికరంగా ఉంది. వద్దనుకున్న టీంలే మళ్లీ అధిక రేటు పెట్టి కొనుక్కున్నాయి. ఇందులో  ఇప్పటి వరకు అత్యధికంగా ఇషాన్ కిషన్ ను 15.25 కోట్లకు మళ్లీ ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత దీపక్ చాహర్ ను 14 కోట్లకు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరిని వదులుకున్న టీమ్ లే మళ్లీ అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం విశేషం.  ఇషాన్ కిషన్ కు ముంబై ఇండియన్స్ గత వేలంలో 6.20 కోట్లు ఇవ్వగా..ఈ సారి ఏకంగా 15.25 కోట్లిచ్చి కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్  దీపక్ చాహర్ కు గత వేలంలో రూ. 80 లక్షలు ఇవ్వగా..ఈ సారి అత్యధికంగా రూ.14 కోట్లకు మళ్లీ సొంతం చేసుకుంది. ఈ సారి ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లిద్దరే.
 
ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను 12.25 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసింది.  శార్దూల్ ఠాకూర్ 10.75 కోట్లు, నికోలస్ పురాన్ ను రూ.10.75 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్, హసన్ రంగను 10.75 కోట్లకు..హర్షల్ పటేల్ ను  10.75 కోట్లకు ఆర్బీసీ కొనుగోలు చేసింది. ఫెర్గుసన్ ను రూ. 10 కోట్లకు గుజరాత్ టైటాన్స్, ప్రసిద్ధ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్,

 రూ. 9 కోట్లు పలికిన రాహుల్ తెహవాటియా, షారుక్ ఖాన్

షారూక్ ఖాన్ ను రూ. 9 కోట్లకు పంజాబ్, రాహుల్ తెహవాటియాను రూ.9 కోట్లకు గుజరాత్ టైటాన్స్, రాహుల్ త్రిపాటిని రూ.8.50 కోట్లకు సన్ రైజర్స్, శివమ్ మావిని రూ. 7.25 కోట్లకు కోల్ కతా,  హజల్ ఉడ్ ను  రూ.7.75 కోట్లకు ఆర్సీబీ, మార్క్ ఉడ్ ను రూ. 7.75 కోట్లకు లక్నో, బెయిర్ స్టోను రూ.6.75 కోట్లకు పంజాబ్, దినేష్ కార్తీక్ ను రూ. 5.50 కోట్లకు ఆర్సీబీ, నటరాజన్ ను రూ.4 కోట్లకు సన్ రైజర్స్ , యజువేంద్ర చాహల్ ను  రూ.6.5 కోట్లకు  రాజస్థాన్ రాయల్స్,  భువనేశ్వర్ ను రూ.4.2 కోట్లు, ముస్తాఫిజా రూ.2 కోట్లు,కుల్దీప్ యాదవ్ ను రూ. 2 కోట్లు పలికారు.