
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని, అందుకే అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదంటూ వస్తున్న వార్తలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. ‘సౌతాఫ్రికా టూర్‌లో మానసికంగా కొంత ఇబ్బంది పడ్డ ఇషాన్ బ్రేక్ కోరుకున్నాడు. మేనేజ్‌మెంట్ దీనికి అంగీకరించింది. ఇషాన్ స్వయంగా సెలెక్షన్‌కు దూరంగా ఉన్నాడు. అతను ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడి జట్టులోకి తిరిగొస్తాడు. శ్రేయస్‌ను సెలెక్ట్ చేయకపోవడం వెనకా క్రమశిక్షణ సమస్య లేదు. టీమ్‌లో చాలా మంది బ్యాటర్లు ఉండటంతో తనకు చాన్స్ రాలేదు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ అతను ఆడలేదు. అంతే తప్ప ఏ ప్లేయర్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.