ఆన్‌లైన్‌లో అన్ని కార్యక్రమాలు.. ఇంట్లోనే ఉండాలి భక్తులు

ఆన్‌లైన్‌లో అన్ని కార్యక్రమాలు.. ఇంట్లోనే ఉండాలి భక్తులు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇస్కాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ కు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యోగా క్లాసులు, ప్రవచనాలు, మెడిటేషన్స్ ఇక ఆన్ లైన్ లో నిర్వహించాలని డిసైడెంది. శ్రీకృష్ణ భక్తులంతా ఇంట్లోనే ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లోని ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులకు సందేశం పంపింది. ఆయా దేశాల్లో తీసుకున్న లాక్ డౌన్ సహా ఇతర నిర్ణయాలను గౌరవించాలని కరోనా నివారణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. ” సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్లాసెస్, సండే ప్రొగ్రామ్స్, మెడిటేషన్ అన్ని ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఐతే అవన్నీ ఇప్పటి నుంచే ఆన్ లైన్ లో మాత్రమే కొనసాగిస్తాం. భక్తులంతా వారి ప్రార్థనలు ఇంట్లోనే చేయాలి. వారికి అందుబాటులో ఉన్న టెంపుల్స్ ద్వారా ఆన్ లైన్ కార్యక్రమాలకు హాజరుకావాలి. ఆన్ లైన్ ద్వారానే శ్రీ కృష్ణ దర్శనం చేసుకోవాలి ” అని ఇస్కాన్ ఆధ్మాత్మిక గురువు రాధానాథ్ స్వామి మహారాజ్ తెలిపారు.