Kannappa: ఏంటీ? కన్నప్పలో ప్రభాస్ చేస్తుంది శివుడి పాత్ర కాదా.. ఇదెక్కడి ట్విస్టు విష్ణన్నా!

Kannappa: ఏంటీ? కన్నప్పలో ప్రభాస్ చేస్తుంది శివుడి పాత్ర కాదా.. ఇదెక్కడి ట్విస్టు విష్ణన్నా!

టాలీవుడ్ హీరో మంచి విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప(Kannappa). మహాశివుడి పరమభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం మంచు విష్ణు దించుతున్న స్టార్ కాస్ట్ ను చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరినీ ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు విష్ణు. 

ఇప్పటికే ఈ సినిమాలో మలయాళం నుండి మోహన్ లాల్,  కన్నడ నుండి శివరాజ్ కుమార్, టాలీవుడ్ నుండి ప్రభాస్, తమిళం నుండి నయనతార వంటి టాప్ స్టార్స్ ను యాక్ట్ చేస్తున్నారు. అయితే.. వీరందరిలో ప్రభాస్ చేస్తున్న పాత్ర కోసం ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో మహాశివుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అందరు అదే అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే తాజా సమాచారం మేరకు.. ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించడం లేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపిస్తారట. 

శివుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను తీసుకున్నారని తెలుస్తుందో. ఇటీవలే బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్ 2 సినిమాలో శివుడిగా కనిపించి మెప్పించారు అక్షయ్. దాంతో శివుడి పాత్ర కోసం ఆయనైతేనే బాగుంటుందని భావించారట మేకర్స్. ఇందుకోసం ఇటీవలే హైదరాబాద్ కూడా వచ్చాడు అక్షయ్ కుమార్. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. లేటెస్ట్ గా వినిపిస్తున్న ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్, కొంతమంది నార్మల్ ఆడియన్స్ కూడా కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. 

నిజానికి ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయిందే ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు అని తెలిసినప్పటి నుండి. అలాంటిది ఇప్పుడు అది నిజం కాదు, అని ఆ పాత్ర కోసం వేరే హీరోను తీసుకున్నారని తెలియడంతో కొంతమంది డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.