Veena Srivani: ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్.. వేణు స్వామి సతీమణి పోస్ట్ వైరల్

Veena Srivani: ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్.. వేణు స్వామి సతీమణి పోస్ట్ వైరల్

సినిమా, పొలిటికల్ సెలబ్రెటీల జాతకాలపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు వేణు స్వామి(Venu Swamy). అంతేకాదు.. చాలా మంది హీరోయిన్స్ కూడా ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అలా ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే.. మరోపక్క ఆయన సతీమణి వీణ శ్రీవాణి(Veena Srivani) కూడా సోషల్ మీడియాలో తన వీణ వాయిద్యంతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. 

ఆమె చేసే వీణ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. తాజాగా ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో శ్రీవాణి వారి తోటలో పండిన సీతాఫలాలు చూపిస్తూ.. ఇవి ఎవరికోసమో తెలుసా.. మన డార్లింగ్ ప్రభాస్(Prabhas) కోసం. మా దగ్గర పండిన సీతాఫలాలు మేము ప్రతి సంవత్సరం కొంతమందికి పంపిస్తాము. అలా ఈ సంవత్సరం ఓ స్పెషల్ వ్యక్తికి పంపిస్తే.. ఆయన వాటిని ప్రభాస్ కి పంపారు. అవి ప్రభాస్ కి నచ్చడంతో మరిన్ని కావాలని అడిగారట. ఇక ప్రభాస్ అడిగాక పంపకుండా ఉంటామా.. ఇదిగో ఈ సీతాఫలాలన్నీ ఆయనకోసమే పంపిస్తున్నాము. వాటితో పాటు ఈ ఆర్గానికి హ్యాండ్ బ్యాగ్ కూడా.. వచ్చే సీజన్ మళ్ళీ ప్రభాస్ గారికి సీతాఫలాలు పంపిస్తాను.. అంటూ తెలిపింది శ్రీవాని. 

Also Read: పూజా కార్యక్రమాలతో మొదలైన ఏషియన్ రవితేజ సినిమాస్.. ఎక్కడో తెలుసా?