ఐసోలేషన్ కేసులు తగ్గుతున్నయ్

ఐసోలేషన్ కేసులు తగ్గుతున్నయ్

కరోనా సస్పెక్టర్స్ డిశ్చార్జ్ ల‌తో వార్డులు ఖాళీ
సరోజినీ దేవి, నేచర్‌ క్యూర్ ఆస్పత్రుల్లో నిల్
చెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ల పరిశీలనలో ఏడుగురు
కింగ్‌ కోఠిలో 20 మంది

హైదరాబాద్, వెలుగు : కరోనా కట్టడికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల‌లో అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచిన కేసుల సంఖ్య తగ్గుతోంది. కరోనా సింప్టమ్స్ తో హాస్పిటళ్ల‌కు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. సిటీలోని వివిధ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ల‌ లో టెస్ట్లు పూర్తయి నెగిటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపి, 28 రోజులు హోం క్వారంటైన్ లో ఉండమని సూచిస్తున్నారు. నిన్న, మొన్నటి దాకా రోగులు, సస్పెక్ట‌ర్స్ తో రద్దీగా ఉన్న హాస్పిటల్స్ ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా కేసులుపెరగుతూ.. తగ్గుతూ ఉండటం వల్ల అధికారులు, డాక్టర్లు అలెర్ట్ గా ఉంటున్నారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే సస్పెక్ట‌ర్స్ ను పరిశీలనలో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి హోంక్వా రంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు

కరోనా సస్పెక్ట‌ర్స్, ప్రైమరీ కాంటాక్ట్ ప‌ర్స‌న్స్ కోసం సిటీలో ఎర్రగడ్డ చెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సరోజినీ దేవి, కింగ్‌ కోఠి, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ప్రభుత్వం ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఎర్రగడ్డ, నల్లకుంట, కింగ్‌ కోఠి హాస్పిటల్స్ లో కొందరు ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా.. మిగిలిన సెంటర్ల‌న్నీ ఖాళీ అయ్యాయి. ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేసిన కొత్తలో ఫారిన్, మర్కజ్ నువ‌చి వచ్చిన వారి ఫ్యామిలీ మెంబర్స్, వారిని కలిసిన వ్యక్తులను వాటిల్లో ఉంచారు. వ్యాధి
లక్షణాలు కనిపించిన వారికి టెస్టులు చేశారు. అబ్జర్వే షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయిన వారిని, టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన సస్పెక్ట‌ర్స్ ను ఇంటికి పంపించారు.

ఎక్కడ ఎంతమంది అంటే..

ఐసోలేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వారం క్రితం వరకూ హాస్పిటల్స్ కు తాకిడి బాగా ఉంది. ఎర్రగడ్డ, ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్ కు రోజుకి100 మంది వరకు సస్పెక్ట‌ర్స్ రాగా.. ప్రస్తుతం 10 మందికి మించడం లేదు. బుధవారం చెస్ట్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో ఏడుగురు మాత్రమే అబ్జర్వేషన్ లో ఉన్నారని, పాజిటివ్ వచ్చిన మరో ఇద్దరు 25 రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని సూపరింటెండెంట్ మెహబూబ్ ఖాన్ చెప్పారు. గాంధీని కరోనా హాస్పిటల్ గా మార్చకముందే పాజిటివ్ వచ్చిన ఆ ఇద్దరికి ఇక్కడే ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల క్రితం ఇక్కడి ఐసోలేషన్ సెంటర్ లో 60 మంది సస్పె క్ట‌ర్స్ ఉండగా.. టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపారు. కింగ్‌ కోఠి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ లో ప్రస్తుతం 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సరోజినీ దేవి, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్ లోని ఐసోలేషన్ లో ఉన్న స‌స్పెక్టర్స్ కు నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు.

సింప్టమ్స్ ఉంటేనే టెస్ట్ లు

నల్లకుంట ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అంతకుముందు 60 మంది దాకా ఉండేవారని సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 10 రోజుల క్రితం డైలీ 50–-60 మందికి టెస్టులు చేసే వాళమని, ప్రస్తుతం ఐదుగురికి చేస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల‌కు అనుమానంతో వస్తున్న వారిలో లక్షణాలుంటేనే టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు లేకపోయినా అనుమానంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే వారికి హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వారంటైన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసి ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.

కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే వచ్చి తీస్కపోతరు

కరోనా లక్షణాలు కనిపించినా, వ్యాధి ఉన్న వారితో కాంటాక్ట్ అయినా 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేస్తే మెడికల్ సిబ్బంది వచ్చి ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తారని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. సిటీలో కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతున్నా కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఐసోలేషన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్లలో అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు.