
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్ర స్థాయికి చేరాయి. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడులతో "గాజా తగలబడుతోంది" అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ మంగళవారం వెల్లడించారు. గాజా సిటీని లక్ష్యంగా చేసుకుని కొత్త ఆఫెన్సివ్ ప్రారంభించామని తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ధ్రువీకరించారు.
ఇజ్రాయెల్ నుంచి ఖతర్‌కు వెళ్తున్న టైంలో ఆయన మీడియాతో మాట్లాడారు. " గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ కొత్త ఆఫెన్సివ్ ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరపడానికి సమయం చాలా తక్కువుంది.
చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడమే మా మొదటి ప్రయారిటీ. బందీలను, ఆయుధాలను వదిలిపెడతామని హమాస్ చెప్పాలి" అని రూబియో అన్నారు.హమాస్ వంటి గ్రూపులతో శాంతి ఒప్పందం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చన్న ఆయన..ఒప్పందం జరగాలనే ఆశిస్తున్నట్లు చెప్పారు.