అమెరికాలో కాల్పులు..ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి

అమెరికాలో కాల్పులు..ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి

అమెరికాలో కాల్పులు.. ఫ్రీ పాలస్తీనా నినాదాలు.. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. సాయుధుడైన ఓ వ్యక్తి వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెట్ ఎంబసీపై కాల్పులతో విరుచుపడ్డాడు. ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న సిబ్బందిని కాల్చి చంపాడు. అనంతరం ఫ్రీ.. ఫ్రీ..పాలస్తీనా అంటూ నినాదాలు చేశాడు. 

వాషింగ్టన్ యూదుల మ్యూజియం వెలుపల గురువారం (మే22) ఈ ఘటన జరిగింది. చికాగెకు చెందిన ఎలియాస్ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి ఈ కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం ఫ్రీ.. ఫ్రీ పాలస్తీనా అని రోడ్రిగ్జ్ చేసిన నినాదాలు అటు అమెరికాను, ఇటు ఇజ్రయెల్ ను కలవర పెట్టాయి. 

నిందితుడు జరిపిన కాల్పుల్లో సారాలిన్ మిల్ గ్రిమ్ అనే 26యేళ్ల యువతి,  30యేళ్ల యారోన్ లిస్చిన్క్సీ  చనిపోయారు. వీరిద్దరు వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నారు. కాల్పుల అనంతరం రోడ్రిగ్స్ ను అమెరికా పోలీసులు బంధించారు. ఆ సమయంలో రోడ్రిగ్స్ ఎలాంటి భయం లేకుండా ఫ్రీ.. ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేయడం అమెరికాతోపాటు ఇజ్రాయెల్ ను కలవరపెట్టింది. 

వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ భయంకరమైన హత్యలు ఇకపై జరగకూడదు. ద్వేషం, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదంటూ’’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.   

వాషింగ్టన్ డిసిలోని కాపిటల్ యూదు మ్యూజియం వెలుపల కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిచారు. ఈ హత్యను ఖండిస్తున్నారు. యూదు ప్రజలందరికి ఇది విషాద వార్త.. మీ దు:ఖంతో నేను పాలు పంచుకుంటున్నానని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.