ఇజ్రాయెల్, హమాస్ డీల్​ పొడిగింపు

ఇజ్రాయెల్, హమాస్ డీల్​ పొడిగింపు

ఇజ్రాయెల్, హమాస్‌‌ మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ఖతర్, అమెరికా ప్రకటించాయి.  ఈ  రెండు రోజుల్లో 50 మంది పాలస్తీనియన్ మహిళా ఖైదీలను రిలీజ్ చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించగా.. బదులుగా మరికొందరు బందీలను విడిచి పెట్టేందుకు హమాస్ ఒప్పుకున్నది.

ఇజ్రాయెల్, హమాస్ డీల్​ పొడిగింపు

గాజా/జెరూసలెం :  ఇజ్రాయెల్, హమాస్‌‌ మధ్య కుదిరిన 4 రోజుల సంధి గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ఖతర్, అమెరికా మంగళవారం ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందం సోమవారంతో ముగియగా.. తాజా పొడిగింపుతో బుధవారం వరకూ డీల్ కొనసాగనుంది. ఈ రెండు రోజుల్లో 50 మంది పాలస్తీనియన్ మహిళా ఖైదీలను రిలీజ్ చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించగా.. బదులుగా మరికొందరు బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది. 

హమాస్​ మిలిటెంట్లు రిలీజ్ చేయనున్న బందీల జాబితాను మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు పంపారు. తాజాగా ఇజ్రాయెల్ విడుదల చేసిన 33 మంది పాలస్తీనా ఖైదీలు.. మంగళవారం వెస్ట్ బ్యాంక్ టౌన్ రమల్లాకు చేరుకున్నారు. అదనంగా 10 మంది బందీలకు ఒక రోజు చొప్పున గడువు పొడిగించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇప్పటిదాకా 4 విడతల్లో 69 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను రిలీజ్ చేశారు.