మీకు తెలుసా : ఇజ్రాయెల్ పోలీస్ యూనిఫాం మన దేశంలో.. మన పక్క రాష్ట్రంలో తయారు చేస్తారంట..!

మీకు తెలుసా : ఇజ్రాయెల్ పోలీస్ యూనిఫాం మన దేశంలో.. మన పక్క రాష్ట్రంలో తయారు చేస్తారంట..!

ఇజ్రాయెల్తో ఇండియాకు ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో అందరికి తెలుసు.. భారత్ లో అత్యధికంగా యూదుల జనాభా కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్నారు. అయితే కేరళతో ఇజ్రాయెల్ పోలీసులకు ఉన్న అనుబంధం గురించి ఎవరికైనా తెలుసా.. కేరళలోని కన్నూర్ లో ఓ బట్టల కంపెనీ ఇజ్రాయెల్ పోలీసులకు యూనిఫారమ్ తయారు చేస్తోంది. కొన్నేళ్లుగా కేరళ నుంచే ఇజ్రాయెల్ పోలీసులకు  యూనిఫామ్ లు సరఫరా అవుతున్నాయి. 

కేరళలోని కన్నూర్ లోని మేరియన్ అప్పారెల్ ప్రైవేట్ లిమిటెండ్ అనే  దుస్తుల తయారీ కంపెనీ 2015 నుంచి ఇజ్రాయెల్ పోలీసులకు యూనిఫారాలను సప్లయ్ చేస్తోంది. ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫారాలను కుట్టించి సరఫరా చేస్తుంది.  తమ కంపెనీ ఇజ్రాయెల్ జైలు పోలీసులకోసం కూడా దాదాపు 50 వేల చొక్కాలు, జాకెట్లను తయారు చేస్తుందని మేరియన్ కంపెనీ ఎండీ థామస్ ఒలికల్ తెలిపారు. 

మేరియన్ అప్పారెల్ కంపెనీ హెడ్ ఆఫీస ముంబై లో ఉంది. 2008 నుంచి ఈ కంపెనీ యూనిఫారమ్ తయారీ యూనిట్ ను కన్నూర్ లో ప్రారంభించింది. ఈ యూనిఫారమ్ ల కుట్టు, తయారీలో దాదాపు 15 వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్దం కారణంగా అదనంగా యూనిఫారమ్ ల తయారీని కోరిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. యూనిఫారమ్ లకోసం మెటీరియల్ యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కంపెనీ చెబుతోంది. 100 శాతం పాలిస్టర్ తో ప్రత్యేకమైన మెటీరియల్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 

ఇజ్రాయెల్ తో పాటు ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, పిలిప్పీన్స్ పోలీసులకు కూడా యూనిఫారమ్ లు ఇక్కడి నుంచే తయారవుతాయి.