గాజాలో ఆస్పత్రి.. స్కూల్పై ఇజ్రాయెల్ సైన్యం దాడి..15 మంది మృతి

గాజాలో ఆస్పత్రి.. స్కూల్పై ఇజ్రాయెల్ సైన్యం దాడి..15 మంది మృతి

హమాజ్ ఉగ్రవాదులే లక్ష్యం ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై విరుచుకుపడుతోంది. శుక్రవారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 15 మంది పౌరులు మృతిచెందగా.. 60 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజాలో అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రికి సమీపంలో ఓ అంబులెన్స్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది..వందలాది మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డారని గాజా వర్గాలు చెబుతున్నాయి. మృతులు, క్షతగాత్రుల గణాంకాలను ఆరోగ్య శాఖ ధృవీకరించాల్సి ఉంది. 

హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఇప్పవరకు మృతులు 

అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3వేల 826 మంది చిన్నారులు సహా 9వేల 227 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు హమాస్ భూభాగంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. గాజాలో 240కి పైగా బందీలుగా ఉన్నారు.

Also Read :- 36 మంది జర్నలిస్టులు మృతి

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ముప్పేట దాడి చేస్తోంది.  రాత్రి వేళ్లలో భూమి, సముద్రం, ఆకాశ మార్గంలో గాజా స్ర్టిప్ పై భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో భయంకర వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు గాజాలో మృతుల సంఖ్యం పెరగడం, అక్కడి భయంకర పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు, హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.