హ‌మాస్ వైమానిక ద‌ళ నేత హ‌తం.. ఇజ్రాయిల్ కీలక ప్రకటన

హ‌మాస్ వైమానిక ద‌ళ నేత హ‌తం.. ఇజ్రాయిల్ కీలక ప్రకటన

వారం రోజుల నుంచి ఇజ్రాయిల్- హమాస్ మధ్య భీకరదాడులు జరుగుతున్నాయి. ఈ ప్రతీకార దాడుల్లో హమాస్ వైమానిక విభాగం అధిపతి మురాద్ అబూ మురాద్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అంతకుముందు వైమానిక కార్య‌కలాపాల‌ను సాగిస్తున్న హ‌మాస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది.

హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు మురాద్ దిశానిర్దేశం చేసిన‌ట్లు వైమానిక దళం ఆరోపిస్తోంది. హ్యాంగ్ గ్లైడ‌ర్ల ద్వారా హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌లో ఎంట‌ర్ కావ‌డానికి మురాద్ కార‌ణ‌మ‌ని చెబుతోంది. సొరంగాలలో దాక్కున్న హమాస్ మిలిటెంట్లను నిర్మూలించడానికి 24 గంటల్లో 1.1 మిలియన్ల మందిని ఖాళీ చేయమన్న అల్టిమేటం పిలుపు మేరకు, దక్షిణ గాజా వైపు నివాసితులను గుర్తించినట్లు తెలిపింది.

లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడేందుకు టెర్రరిస్ట్ సెల్ ప్రయత్నించిందని, మానవరహిత వైమానిక వాహనం (UAV) దాడిలో అనేక మంది ఉగ్రవాదులు మరణించారని కూడా వైమానిక దళం తెలిపింది. "హమాస్ ఉగ్రవాద సంస్థ ఈ నివాసితులను మానవ కవచంగా ఉపయోగించుకోవడానికి ఈ చర్యను తిరస్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, నివాసితులు దక్షిణం వైపు వెళ్లే ధోరణిని IDF గుర్తించింది" అని చెప్పుకొచ్చింది.