తారక మంత్రం

తారక మంత్రం

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంత గొప్ప యాక్టర్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండే పాత్రల్ని, కథల్ని ఎంచుకుంటూ తనలోని నటుణ్ని సరికొత్తగా పరిచయం చేస్తూనే ఉంటాడు ప్రేక్షకులకి. అయితే ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్’లో చేసిన కొమురం భీమ్ పాత్ర నటుడిగా తన స్థాయిని బాగా పెంచింది. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ తారక్‌‌‌‌‌‌‌‌ నటనకి ఫిదా అయిపోతున్నారంతా. రామ్‌‌‌‌‌‌‌‌ చరణ్, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో రాజమౌళి తీసిన ఈ సినిమాయే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే.. భీమ్ పాత్ర అంచనాల్ని మించి అందరి మనసుల్లోకీ దూసుకుపోయింది.

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఇజ్రాయెల్ దేశంలోని ఒక వార్తా పత్రికలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ స్పెషల్ స్టోరీ రాశారు. ఎన్టీఆర్ ఫొటోలు వేయడంతో పాటు అతని నటన, బాడీ లాంగ్వేజ్ అద్భుతమంటూ అందులో పొగిడేశారు. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతూ ఉండటంతో తారక్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఖుషీ అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ కొరటాల డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌‌‌‌‌‌‌‌ మూవీ లైన్‌‌‌‌‌‌‌‌లో ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడానికి కూడా ఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. వీళ్లందరూ గ్రేట్ ఫిల్మ్ మేకర్సే. తారక్‌‌‌‌‌‌‌‌ కోసం కచ్చితంగా మంచి మంచి పాత్రలే డిజైన్ చేసి ఉంటారు. అవన్నీ క్లిక్ అయితే ఎన్టీఆర్ పేరు మరింత మారుమోగిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు.