గగన్‌యాన్ కోసం నలుగురు వ్యోమగాములు సిద్ధం

గగన్‌యాన్ కోసం నలుగురు వ్యోమగాములు సిద్ధం

త్వరలో మిషన్ గగన్‌యాన్

త్వరలోనే నలుగురు వ్యోమగాములతో మానవ సహిత అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. గగన్‌యాన్ మిషన్ 2022 నాటికి ప్రయోగిస్తామని శివన్ తెలిపారు. అందులో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని, వారు అక్కడ కనీసం ఏడు రోజులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గగన్‌యాన్ యొక్క అనేక వ్యవస్థలను ఇంకా పరీక్షించాల్సి ఉందని శివన్ అన్నారు. అంతరిక్షలోకి పంపే వ్యోమగాములకు ఈ సంవత్సరం శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మిషన్ చంద్రయాన్-3కి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రయోగించనున్నట్లు శివన్ తెలిపారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2 చాలా వరకు విజయవంతమైందని, కానీ, చివరి సమయంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైందని ఆయన తెలిపారు. ల్యాండర్ క్రాష్ అయిన చిత్రాలను నాసా ఇటీవల చెన్నై టెక్కీ సహాయంతో కనిపెట్టి ప్రచురించిందని ఆయన అన్నారు. చంద్రయాన్ -2 ఆర్బిటర్ ఇప్పటికీ పనిచేస్తుందని, ఆ ఆర్బిటర్ మరో ఏడు సంవత్సరాలు డేటాను అందిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే రెండో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో 2300 ఎకరాల భూసేకరణను ప్రారంభించినట్లు శివన్ తెలిపారు.