ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్.. అంతరిక్షాన్ని జయించారు.. అలాంటిది 

ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్.. అంతరిక్షాన్ని జయించారు.. అలాంటిది 

చంద్రుడిని ముద్దాడారు.. సూర్యుడిని టచ్ చేయలేమా అంటూ సవాల్ చేశారు.. అలాంటి వ్యక్తి క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆయన మరేవరో కాదు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్. సోమనాథ్‌. ఈ విషయాన్ని సోమవారం(మార్చి 4) ఆయనే స్వయంగా వెల్లడించారు. సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రారంభించిన రోజున రొటీన్ చెకప్‌లో భాగంగా చేసిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ సోకినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు.

చంద్రయాన్-3 మిషన్ లాంచ్ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ సమయంలో అవేంటో తనకు స్పష్టంగా తెలియలేదని సోమనాథ్ చెప్పారు. ఆ తరువాత తాను వైద్య పరీక్షలు చేయించుకోగా.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజున వచ్చిన రిపోర్టులలో తన శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ వార్త తన కుటుంబ సభ్యులను, సహోద్యోగులను విషాదంలో నింపిందని ఇస్రో చీఫ్ వివరించారు. 

2 సెప్టెంబర్, 2023 

భారతదేశపు మొదటి సన్ మిషన్(సూర్యుడిపై ప్రయోగాల కోసం) ఆదిత్య L-1 తన ప్రయాణాన్ని 2 సెప్టెంబర్ 2023న ప్రారంభించింది. అదే రోజున సోమనాథ్‌ క్యాన్సర్ బారిన పడినట్లు నిర్దడ్న అయ్యింది. ఆపై కీమో థెరపీ చేయించుకున్న ఆయన.. నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి ఇస్రోలో తన విధులను ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిరంతరం పరీక్షలు చేయించుకుంటున్నట్లు వెల్లడించారు.