వెలుగు సక్సెస్ : ఇస్రో ప్రయోగాలు

వెలుగు సక్సెస్ :  ఇస్రో ప్రయోగాలు

2023లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పలు ప్రయోగాలను చేపట్టింది. పీఎస్​ఎల్​వీ సీ-54, పీఎస్​ఎల్​వీ సీ-55, పీఎస్​ఎల్​వీ సీ-56 ద్వారా స్వదేశీ ఉపగ్రహాలతోపాటు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో విజయవం తంగా ప్రవేశపెట్టింది. ఇండియన్​ రీజనల్​ నావిగేషన్​ శాటిలైట్​ సిస్టం బలోపేతం కోసం రూపొందించిన ఎన్​వీఎస్​-01 ఉపగ్రహాన్ని జీఎస్​ఎల్వీ ఎఫ్​-12  విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అలాగే, చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్​ఎస్​ఎల్​వీను విజయవం తంగా రూపొందించి ప్రయోగించింది. 

పీఎస్​ఎల్​వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక 2023, జులై 29న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూస్పేస్​ ఇండియా లిమిటెడ్​ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీష్​ ధావన్​ స్పేస్​ సెంట్​(షార్​) నుంచి ప్రయోగించాయి. పీఎస్​ఎల్​వీ సీ–56 రాకెట్​ నాలుగు దశల్లో సింగపూర్​కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని నియో ఆర్బిట్​ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోల బరువు కలిగిన డీఎస్​–ఎస్​ఏఆర్(షార్ట్​ ఫర్​ సింథటిక్​ ఆపార్చర్​ రాడార్​) అనే ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​, 23.58 కిలోల ఆర్కేడ్​, 23 కిలోల బరువున్న వెలాక్స్​–ఏఎం, 12.8 కిలోల ఓఆర్​బీ–12 స్ట్రయిడర్​ , 3.84 కిలోల గలాసియా–2, 4.1 కిలోల స్కూబ్​–11, 3.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌05 కిలోల బరువైన న్యూలయన్​ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్​లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు షార్​ నుంచి ఇది 90వ ప్రయోగం.
పీఎస్​ఎల్​వీ సీ-54 ఇస్రో శ్రీహరికోట రాకెట్​ ప్రయోగ కేంద్రం నుంచి 2022, నవంబర్​ 26న ప్రవేశపెట్టిన పీఎస్​ఎల్వీ సీ–54 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా భారత్​కు చెందిన 1,117 కిలోల బరువున్న ఈఓఎస్​ –06, 18.28 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలో బరువున్న రెండు థాయ్​ బోల్ట్​ శాటిలైట్స్​తోపాటు 17.92 కిలోల బరువున్న 4 యూఎస్​కు చెందిన యాస్ట్రో కాట్​ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూ వాతావరణంపై పీఎస్ఎల్​వీ సీ–54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 

జీఎల్​ఎల్​వీ ఎఫ్​-12

ఇస్రో శ్రీహరికోటలోని షార్​ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్​ఎల్వీ ఎఫ్​–12 రాకెట్​ ప్రయోగం విజయవంతమైంది. 2023, మే 29న సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​ నుంచి రాకెట్​ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్​వీఎస్​–01 ఉపగ్రహాన్ని రాకెట్​ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్​ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్​ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్​ సేవలు అందించనుంది. జీఎస్​ఎల్​వీ ఎఫ్​–12 రాకెట్​ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2232 కిలోల బరువున్న ఎన్​వీఎస్​–01 జీవిత కాలం 12 ఏళ్లు. నావిగేషన్​ శాటిలైట్​ సిస్టం బలోపేతం కోసం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ(ఇండియన్​ రీజనల్​ నావిగేషన్​ శాటిలైట్​ సిస్టం) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్​–01 పేరుతో నావిగేషన్​ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించారు. నావిక్​–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్​–5, ఎస్​–బాండ్​ల సిగ్నల్స్​తో పనిచేసేలా రూపొందించారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, ఇంటర్నెట్​తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకూ దోహదపడుతుంది. 

అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం

పీఎస్​ఎల్​వీ సీ-56 రాకెట్​లోని నాలుగో దశ (పీఎస్​-4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న  వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్​ ఎస్​.సోమనాథ్​ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్​-4 అక్కడి నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాలు తదుపరి చెత్త తొలగిస్తుంది. 

ఎస్​ఎస్​ఎల్​వీ డీ2

ఇస్రో శాస్త్రవేత్తలు మొదటిసారిగా చిన్న ఉపగ్రహ వాహకనౌకను (ఎస్​ఎస్​ఎల్​వీ) రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు. తిరుపతి జిల్లాలోని షార్​లో ఈ వాహకనౌక  నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రోకు 156.3 కిలోల బరువు గల ఈవోఎస్​–07 ఉపగ్రహంతోపాటు అమెరికా అంటారిస్​ సంస్థకు చెందిన 11.5 కిలోల జామస్​–1, చెన్నై స్పేస్​ క్విడ్జ్​ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్​ –2 లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

ఈవోఎస్​-07: ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్ లక్ష్యం మైక్రోశాటిలైట్​, కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్​ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ఎంతో అవసరం కానుంది. 
ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులు గుర్తించవచ్చు. 

జానుస్-1: బరువు 10.2 కిలోలు. అంటా రిస్​ సాఫ్ట్​వేర్​ ప్లాట్​ఫారం ఆధారంగా రూపొందిన శాటిలైట్​ మిషన్ ఇది. 

ఆజాదీ శాట్​-2: బరువు 8.7కిలోలు. 

ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 750 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీన్ని చెన్నైలోని స్పేస్​ కిడ్జ్​ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు.