చిన్న ఉపగ్రహాల లాంచింగ్ కోసం ఇస్రో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ’

చిన్న ఉపగ్రహాల లాంచింగ్ కోసం ఇస్రో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ’

చిన్న ఉపగ్రహాల లాంచింగ్ కోసం ప్రత్యేకంగా లాంచ్‌ వెహికల్‌ను డెవలప్‌ చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. రెగ్యులర్‌‌గా వాడే పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ లాంచ్‌ వెహికల్‌ బదులు స్మాల్ శాటిలైట్‌ లాంచ్ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ని డెవలప్‌ చేయబోతోంది. దీనిని ప్రైవేటు భాగస్వామ్యంతో 2022 తొలి త్రైమాసికం పూర్తయ్యే లోపు తయారు చేయాలని ఇస్రో నిర్దేశించుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.169 కోట్ల నిధులను మంజూరు చేసింది.