నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ –సి58 రాకెట్...

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ –సి58 రాకెట్...

శ్రీహరికోట:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ప్రయోగంతో న్యూఇయర్ ను ప్రారంభించింది.2024, జనవరి 1న ఇస్రో చపట్టిన  పీఎస్ఎల్వీ–సి58 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కొద్దిసేపటిక్రితం  PSLV C-58 రాకేట్ ద్వారా ఎక్స్  రే  పొలారి మీటర్ శాటిలైట్  ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్  స్పేస్  సెంటర్  నుంచి ఇస్రో ప్రయోగించింది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మొదటి పొలారిమీటర్ మిషన్. 

ఈ రాకెట్ లో పంపుతున్న ఎక్స్​ పోశాట్​ ఉపగ్రహం పీవోఎల్ఐఎక్స్ (పోలారిమీటర్ ఇన్ స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్ రేస్). దీనిని రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డిజైన్ చేయగా బెంగళూరుకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారుచేసింది. ఐదేళ్ల పాటు పనిచేసే ఈ ఉపగ్రహం అంతరిక్ష అధ్యయనాలలో కీలకంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.

కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్ రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్  అధ్యయనం చేయనుంది.ఈ అధ్యయనానికి ఎక్స్ పోశాట్ లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్ లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి.