
లాక్ డౌన్ తర్వాత మరో ప్రయోగానికి రెడీ అయ్యింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. రేపు(శనివారం) సాయంత్రం 3 గంటల 2 నిమిషాలకు PSLV సీ-49 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్ట్రో శాస్త్రవేత్తల టీమ్. ఈ శాటిలైట్ ద్వారా భారత్ కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రేపు మధ్యాహ్నం నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.