
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రోలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లు, టెక్నీషియన్ బి ఉద్యోగాల నియామకానికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. ఆసక్తిగల అభ్యర్థులు ఇవాళ్టి( అక్టోబర్ 9) నుంచి అక్టోబర్ 31 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను సమర్పించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తును https://www.prl.res.in/OPAR లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
టెక్నికల్ అసిస్టెంట్ కు రూ. 250లు(నాన్ రీఫండబుల్ ఫీజు) చెల్లించాలి. మొదట అన్ని వర్గాల అభ్యర్థులు రూ. 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.. ఫీజు మినహాయింపు ఉన్న మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ఎస్ అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లయితే వారికి తిరిగి రుసుము చెల్లించబడుతుంది. UR/EWS/OBC అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లయితే రూ. 500లు తిరిగి చెల్లిస్తారు. రాత పరీక్షకు హాజరుకాని అభ్యర్థులందరికీ అప్లికేషన్ ఫీజు చెల్లించబడదు.
ఉద్యోగం: టెక్నికల్ అసిస్టెంట్
- పోస్టుల సంఖ్య: 10
- విభాగాల వారీగా ఖాళీలు:
- సివిల్: 2
- మెకానికల్: 2
- విద్యుత్ : 2
- కంప్యూటర్ సైన్స్ / ఐటీ : 3
- ఎలక్ట్రానిక్స్ : 1
- అర్హత : గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు నుంచి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా
పే స్కేల్: లెవల్ 7, రూ. 44,900 – రూ. 1,42,400
పోస్టు: టెక్నీషియన్ -బి
- పోస్టుల సంఖ్య: 10
- విభాగాల వారీగా ఖాళీలు:
- టర్నర్ : 2
- మెషినిస్ట్ : 1
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 2
- ఎలక్ట్రీషియన్: 2
- ప్లంబర్: 1
- మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్: 1
- అర్హత : NCVT నుంచి సంబంధిత ట్రేడ్‌లో ITI / NTC / NAC.
- పే స్కేల్: లెవల్ 3, రూ. 21,700 – రూ. 69,100
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు తమ దరఖాస్తును https://www.prl.res.in/OPAR లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి . ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ లింక్ 31.10.2025 (రాత్రి 24.00 గంటలు) వరకు యాక్టివ్‌గా ఉంటుంది.