చంద్రయాన్ 3 ఫొటోలు : చంద్రుడి ఉపరితలం గ్రానైట్ రంగులో.. రాతి నేలగా ఉంది

చంద్రయాన్ 3 ఫొటోలు : చంద్రుడి ఉపరితలం గ్రానైట్ రంగులో.. రాతి నేలగా ఉంది

చంద్రయాన్ 3.. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ ఇస్రో వైపు చూస్తోంది. చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్న చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇదే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత సమీపం నుంచి.. చంద్రయాన్ 3 తీసిన ఫొటోలను రిలీజ్ చేసింది. చంద్రుడి ఉపరితలం రాతి నేలగా ఉంది. ఇదే సమయంలో గ్రానైట్ రాయి రంగులో ఉన్నట్లు ఫొటోలు చూస్తే స్పష్టం అవుతుంది. అదే విధంగా చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఫొటోల్లో కనిపిస్తున్నట్లు.. చదరంగా ఉన్న నేలపైనే ల్యాండర్ విక్రమ్ దిననున్నట్లు తెలిపింది ఇస్రో. చివరి నిమిషంలో ప్రదేశం మార్చుకోవటానికి వీలుగా కూడా మరికొన్ని ప్రదేశాలను కూడా విశ్లేషిస్తున్నారు.

చంద్రుడి ఉపరితలం కొన్ని ప్రాంతాల్లో చదరంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో లోయలు ఉన్నాయి. అంటే భూమిని పోలిన విధంగా చంద్రుడి ఉపరితలం ఉన్నట్లు ఫొటోలతో స్పష్టం అవుతుంది. చంద్రయాన్ 3 కొత్తగా పంపించిన ఫొటోలతో ల్యాండింగ్ ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నది ఇస్రో. ఇప్పటి వరకు అయితే మన ల్యాండర్ విక్రమ్ అద్భుతమైన ఫొటోలను పంపిస్తుంది. ఇక సవ్యంగా దిగితే మాత్రం.. ప్రపంచ పరిశోధనా రంగంలో అద్భుతమే.. ఇదే జరగాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.

రష్యా ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ఫెయిల్ కావటంతో.. అందరి దృష్టి మనపై పెరిగింది. ఇదే సమయంలో ఒత్తిడి కూడా ఉంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఇప్పటి వరకు ఏ దేశం పరిశోధనలు చేయలేదు. ఇండియా, రష్యాలు మాత్రమే ఒకేసారి రెండు శాటిలైట్లను పంపాయి. రష్యా లూనా శాటిలైట్ కూలిపోవటంతో.. చంద్రయాన్ 3పై మరింత ఆసక్తి నెలకొంది.