
కేరళలో భారీ వర్షాల కారణంగా వయనాడ్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 250 మంది చనిపోయారు. అనేకమంది గల్లంతు అయ్యారు. 1500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండచరియలు కుప్పకూలాయి. వయనాడ్ ప్రకృతి విపత్తుకు చెందిన శాటిలైట్ హై రెజల్యూషన్ తో తీసిన ఫొటోలను ఇస్రో గురువారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ శాటిలైట్ ఈ చిత్రాలను క్యాచ్ చేసింది.
వయనాడ్ చుట్టు పక్కల ఉన్న గ్రామాలు నేలమట్టం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టం అంతరిక్ష నుంచి తీసిన ఫొటోలో స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 86వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూమి జారిపోయింది. లోయకు ఇరువైపులా 8 కిలోమీటర్ల మేర వరద ప్రవహిస్తున్నది. పైన ఉన్న ఫొటోలో కొండచరియలు కూలిన భాగాన్ని చూడవచ్చు. ఇళ్లు, చెట్లు, బిల్డింగులు కొట్టుకుపోయాయి. దాదాపు 250మంది వరకు వరదల్లో తప్పిపోయారు. రెస్క్యూ టీంల సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ALSO READ : Wayanad Landslide Tragedy: వయనాడ్ విషాదం..బాధితులకి హీరో సూర్య కుటుంబం ఆర్ధిక సాయం