ఇస్రో మరో కీలక ప్రయోగం.. రేపే GSLV-F10

ఇస్రో మరో కీలక ప్రయోగం.. రేపే GSLV-F10

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. GSLV F-10 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రేపు తెల్లవారుజామున 5 గంటల 43 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్  స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-10 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు రెండేళ్లుగా కరోనాతో షార్ లో ప్రయోగాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో PSLV ప్రయోగం తరువాత షార్ లో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడ్డా GSLV F-10 ప్రయోగాన్ని..... ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ఈప్రయోగంతో మొదటిసారి భూస్థిర కక్ష్యలోకి రిమోట్ సెన్సింగ్  శాటిలైట్ ను పంపిస్తున్నారు. దేశ భద్రత, రక్షణ అవసరాల కోసం ఈ ప్రయోగం కీలకం కానుంది.