చంద్రయాన్-3కి రంగం సిద్ధం : ఇస్రో

చంద్రయాన్-3కి రంగం సిద్ధం : ఇస్రో

చంద్రయాన్-3ని ప్రయోగించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది నవంబర్-2020లో చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేసింది ఇస్రో. చంద్రయాన్-3కు సంబంధించి సాఫ్ట్ ల్యాండింగ్ పై సైంటిస్టులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఈ ప్రయోగం కోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఇస్రో.

నవంబర్ -2020లో చంద్రయాన్-3ని ప్రయోగించనున్నట్లు తెలిపిన ఇస్రో..త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్ -2020లోనే ఈ గొప్ప ప్రయోగాన్ని చేపడుతామని తెలిపారు సైంటిస్టులు. జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు ఇప్పటికే చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలను ఇస్రో చేపట్టగా.. చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.