ఆదిత్య L1 మిషన్: పేలోడ్ రెండో పరికరం పని మొదలుపెట్టింది

ఆదిత్య L1 మిషన్: పేలోడ్ రెండో పరికరం పని మొదలుపెట్టింది

సూర్యునిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 పనిలో పడిందని ఇస్రో ప్రకటించింది. అధ్యయనంలో భాగంగా ఆదిత్య ఎల్ 1 లో అమర్చిన పేలోడ్ లోని రెండో పరికరం పనిచేయడం ప్రారంభించింది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1 లోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ (ASPEX)లో రెండో పరికరం సోలార్ విండ్ అయాన్ స్పెక్టోమీటర్ (SWIS)  పనిచేస్తుందని శనివారం (డిసెంబర్2) ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ (ASPEX) పేలోడ్ లో రెండో పరికరం అయిన సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (SWIS)  పనిచేస్తుంది. రెండో రోజు ల్లో SWISచేత సంగ్రహించబడిన ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ గణనలలో శక్తి మార్పులను వివరిస్తుందని ’’ Xలోపోస్ట్ చేసింది. 

ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య L1 ఉపగ్రహంలో ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ (ASPEX) పేలోడ్ సాధారణంగా పనిచేస్తుంది. ASPEXలో రెండు అత్యాధునిక పరికరాలను కలిగి ఉంది.. అవి సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (SWIS) , సుప్రా థర్మల్  అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్(STEPS). సెప్టెంబర్ 10,2023న STEPS పరికరం ప్రారంభించబడింది. SWIS పరికరం నవంబర్ 2, 2023న క్రియాశీలకం చేయబడింది. ఇది అప్పటినుంచి సరియైన తీరులో పనిచేస్తుందని ఇస్రో తెలిపింది. 

ASPEXపేలోడ్ విజయవంతంగా పనిచేస్తుందని.. సోలార్ విండ్ అయాన్ల కొలతలను ప్రారంభించిందని ఇస్రో శనివారం విడుదల చేసిన ప్రటకనలో తెలిపింది.  SWIS రెండు  సెన్సార్ యూనిట్లను 360 డిగ్రీస్ దృష్టి కోణాన్ని ఉపయోగించుకొని, ఒకదానికొకటి లంబంగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఈ పరికరం సౌర పవన అయాన్ లను ప్రధానంగా ప్రోటాన్లు, ఆల్ఫాకణాలను విజయవంతంగా కొలుస్తుందని ఇస్రో తెలిపింది. 

2023 నవంబర్ లో సెన్సార్ లలో ఒకదాని నుంచి మోడల్ ఎనర్జీ హిస్టోగ్రాం సేకరించారు. ప్రోటాన్ (H+), ఆల్ఫా ప్రాక్టికల్ (డబుల్ అయోనైజ్డ్ హీలియం, He2+గణనలోని వైవిధ్యాలను వివరిస్తుంది. ఈ వివిధ్యాలు ఏకీకరణ సమయంలో రికార్డ్ చేయబడ్డాయి. దీనికి సంబంధించిన సమగ్ర స్నాప్ షాట్ ను సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ అందిస్తుందని ఇస్రో వెల్లడించింది. 

చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్ 3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత .. ఇస్రో సెప్టెంబర్ 22023న శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ నుంచి దేశీయ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1 ను ప్రయోగించింది.

అంతరిక్షంలో వ్యూహాత్మక స్థానం వద్ద సూర్యుడిని గ్రహణాలు అడ్డుకోకుండా నిరంతరం గమనించేలా.. సౌర్య కర్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1ను ప్రయోగించారు.  

అంతేకాదు.. ఆదిత్య ఎల్ 1 అందించే డేటా.. సౌర విస్ఫోటనం సంఘటనలకు దారి తీసే ప్రక్రియల క్రమాన్ని గుర్తించడంలో సహాయపడుతుందని.. అంతరిక్ష వాతావరణ పరిస్థితులపై లోతైన అవగాహనకు దోహం చేస్తుందని ఇస్రో తెలిపింది.