V6 News

ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ప్రాచీ గైక్వాడ్కి స్వర్ణం

ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ప్రాచీ గైక్వాడ్కి స్వర్ణం


కైరో: ఇండియా షూటర్‌‌‌‌‌‌‌‌ ప్రాచీ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌.. ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ 3 పొజిషన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ప్రాచీ 354.6 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. దర్యా చుప్రిస్‌‌‌‌‌‌‌‌ (354.4), ఎలెనా క్రెటినికా (343.3) వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. క్వాలిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిన ప్రాచీ.. ఫైనల్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా 10 పాయింట్లు గెలిచింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో నారెన్‌‌‌‌‌‌‌‌ ప్రణవ్‌‌‌‌‌‌‌‌ 229.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు. విమెన్స్​ 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​లో వాన్షికా చౌదరీ, సెజల్​ కాంబ్లీ గోల్డ్​, సిల్వర్​ గెలిచారు.