ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు ఆందోళన

ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు ఆందోళన

హిట్ అండ్ రన్ కేసుపై ఢిల్లీలో రచ్చ కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న ఉదయం స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టింది. అంతేకాకుండా యువతిని కారు 4 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీని అట్టుడికిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు.. యువతి కుటుంబసభ్యులు.. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు..ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రొటెస్ట్ తో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు.

ఢిల్లీలో జనవరి 1 వ తేదీన ఉదయం అంజలి అనే యువతి స్కూటీపై వెళ్తుండగా.. ఓవర్ స్పీడ్ తో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆ యువతిని దాదాపు నాలుగు కిలో మీటర్లు లాక్కెల్లింది. ఈ ఇష్యూ ఢిల్లీలో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తుంది. సుల్లాన్ పురి నుంచి ఢిల్లీలోని కంఝవాలా వరకు యువతిని కారుతో ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అంజలి.. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో అటు అంజలి కుటుంబ సభ్యులు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అంతకముందు సుల్తాన్ పురిలో కుటుంబసభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సమయంలో పరిస్థితి చేయిదాటిపోయింది. క్లూస్ టీమ్స్ కార్లపై రాళ్లతో దాడి చేశారు ఆందోళనకారులు. ఆ తర్వాత ప్రొటెస్ట్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ కు షిఫ్ట్ అయింది. రెండుగంటలుగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. శాంతి భద్రతల నిర్వహణలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఫెయిల్ అయ్యారని.. వీకే సక్సెనా  వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.