
తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ లవ్‌స్టోరి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ ఫిల్మ్.. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా లవ్‌స్టోరి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో లేటెస్ట్‌గా విడుదలైన చిత్ర ట్రైలర్ దుమ్ము రేపుతోంది. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన గంటలోనే ఒక మిలియన్‌కు పైగా రియల్ టైమ్ వ్యూస్‌తో సత్తా చాటింది. రిలీజ్‌కు ముందే ఇంత హంగామా సృష్టిస్తున్న లవ్‌స్టోరి.. థియేటర్లలో ఎంత సందడి చేస్తుందో చూడాల్సిందే.