ఐటీ రిటర్న్ప్ ఫైల్ చేయని వారి వద్దకు అధికారులు

ఐటీ రిటర్న్ప్ ఫైల్ చేయని వారి వద్దకు అధికారులు

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ (ఐటీ) రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయని వారిలో అవగాహన పెంచేందుకు ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్ స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ను మొదలు పెట్టనుంది. రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉన్నా ఇంకా ఫైల్ చేయని 1.52 కోట్ల మందిని  గుర్తించింది. ట్యాక్స్ బ్రాకెట్‌‌‌‌లో ఉన్నవారు, ఇప్పటికే ట్యాక్స్ డిడక్టెడ్‌‌‌‌ ఎట్ సోర్స్ (టీడీఎస్) కట్ అయినా రిటర్న్స్ ఫైల్ చేయని వారిని ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్ సంప్రదించనుంది.  

ఈ నెల 15 నుంచి ఇలాంటి ఇండివిడ్యువల్స్‌‌‌‌తో కాంటాక్ట్ అవ్వాలని ఫీల్డ్ ఆఫీసర్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్‌‌‌‌ ట్యాక్సెస్‌‌‌‌ (సీబీడీటీ) ఆదేశించింది. ఎందుకు రిటర్న్స్ ఫైల్ చేయాలో వారికి వివరించనున్నారు.  కాగా, 2022–23 లో 8.9 మంది ట్యాక్స్ పేయర్లు ఉండగా, 7.4 కోట్ల రిటర్న్‌‌‌‌లు మాత్రమే ఫైల్ అయ్యాయి. అంటే 1.97 కోట్ల ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్‌‌‌‌ను ఫైల్ చేయలేదు. ఇందులో 1.93 కోట్ల మంది ఇండివిడ్యువల్ కేటగిరీలో ఉన్నారు.